HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Siddaramaiah Likely To Visit Delhi Today

Karnataka CM: ఢిల్లీకి సిద్దరామయ్య.. డీకే రూటేటో ??

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారితో గెలుపొందింది. ఈ పోరులో బీజేపీ సత్తా చాటలేకపోయింది. ఇక జేడీఎస్ ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

  • Author : Vamsi Chowdary Korata Date : 15-05-2023 - 11:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karnataka
Karnataka Cm

Karnataka CM: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారితో గెలుపొందింది. ఈ పోరులో బీజేపీ సత్తా చాటలేకపోయింది. ఇక జేడీఎస్ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ తేల్చలేకపోతుంది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు సీఎం రేసులో ఉన్నారు. ఎవరికీ వారు తమ మద్దతు దారులతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. మరోవైపు సీఎం ఎవరన్నది పార్టీ హైకమాండ్ తేల్చుతుందంటున్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూనే ఎవరికీ వారు సీఎం కుర్చీ కోసం క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు.

కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సీఎంను ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి చాలా సవాల్‌గా మారుతోంది. దీనికి సంబంధించి పార్టీ పరిశీలకులను కూడా నియమించింది, వారు ఈ రోజు ఢిల్లీలో హైకమాండ్‌కు నివేదికను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ రోజు రాజధానిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవనున్నారు. మరోవైపు కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి చేరుకోవడంపై చర్చ జరుగుతుంది. అయితే ఆయన దానిని ఖండించారు.

ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని డీకే శివకుమార్ తెలిపారు. నేను ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకోలేదని, ఎన్నికల సమయంలో నేను చేయాల్సింది చేశానని, ఇప్పుడు సీఎంను హైకమాండ్ నిర్ణయిస్తుందని శివకుమార్ అన్నారు. ఇదిలా ఉండగా.. కర్నాటక ముఖ్యమంత్రి నిర్ణయంపై కాంగ్రెస్ పరిశీలకుడు భన్వర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున 2 గంటల వరకు ఎమ్మెల్యేలందరి అభిప్రాయం తీసుకుని నివేదికను సిద్ధం చేశామన్నారు. త్వరలోనే ఈ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడికి అందజేస్తామని చెప్పారు.

Read More: MUSLIM DEPUTY CM : ముస్లింనే డిప్యూటీ సీఎం చేయాలి : కర్ణాటక వక్ఫ్ బోర్డు చీఫ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • delhi
  • DK Shivakumar
  • karnataka cm
  • mallikarjun kharge
  • siddaramaiah

Related News

West Bengal Congress

West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

ఐదు రాష్ట్రాల్లో కేరళ ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తోంది. అక్కడ పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF)పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు వరంగా మారింది. యూడీఎఫ్ (UDF) కూటమి ఏకంగా 99 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

Latest News

  • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

  • T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

  • Revanth Reddy: CM, VIP కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.

  • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

  • Gold Price Today: పసిడి ప్రియులకు భారీ శుభవార్త..

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd