PM Modi: రాజేంద్ర చోళ ప్రథమ గౌరవార్థం స్మారక నాణెం విడుదల చేసిన ప్రధాని.. ఎవరీ చక్రవర్తి?!
ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం చోళ సామ్రాజ్యంపై రెండు భాగాలలో సినిమాలు తీశారు. పొన్నియిన్ సెల్వన్ పేరుతో పార్ట్ 1, పార్ట్ 2గా విడుదలైన ఈ సినిమాలు చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్రను ప్రపంచానికి తెలియజేశాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి.
- Author : Gopichand
Date : 27-07-2025 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమిళనాడు పర్యటనలో భాగంగా ఆదివారం తిరుచిరాపల్లి జిల్లాలోని గంగైకొండ చోళపురం ఆలయానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన తిరువతిరై మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రవర్తి రాజేంద్ర చోళ ప్రథమ జయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ఒక స్మారక నాణేన్ని ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ రోజును ఆగ్నేయ ఆసియా చారిత్రాత్మక సముద్ర విజయం 1000 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా జరుపుకుంటున్నారు.
సముద్ర విజేత, చోళ సామ్రాజ్య పాలకుడు
చక్రవర్తి రాజేంద్ర చోళ ప్రథమ భారత చరిత్రలో అత్యంత శక్తివంతమైన, దూరదృష్టి గల పాలకులలో ఒకరిగా పరిగణించబడతాడు. ఆయనను సముద్ర శాసనకర్తగా కూడా పిలుస్తారు. రాజేంద్ర చోళ ప్రథమ పాలనలో చోళ సామ్రాజ్యం దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో తన ప్రభావాన్ని గణనీయంగా విస్తరించింది. ఆ సమయంలో సముద్రంలోని పెద్ద భాగంపై ఆయన ఆధిపత్యం ఉండేది. రాజేంద్ర చోళ ప్రథమ గంగైకొండ చోళపురాన్ని తన రాజధానిగా స్థాపించాడు. అదే సమయంలో రాజధానిలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం శతాబ్దాలుగా శైవ భక్తి, అద్భుతమైన చోళ వాస్తుకళ, పరిపాలనా నైపుణ్యానికి చిహ్నంగా నిలిచిందని నమ్ముతారు.
Also Read: EV Prices Hiked: షాక్ ఇస్తున్న ఎలక్ట్రిక్ కారు.. ఏడు నెలల్లో మూడోసారి ధర పెంపు!
రాజేంద్ర చోళ ప్రథమ వద్ద ఒక శక్తివంతమైన నౌకాదళం ఉండేది. ఈ సైన్యం సముద్రంపై ఆధిపత్యం చెలాయించింది. ఈ సైన్యం ద్వారానే చక్రవర్తి ఉపఖండ చరిత్రను మార్చాడు. తన నౌకాదళ సహాయంతో రాజేంద్ర చోళ ప్రథమ ఇండోనేషియాలోని శ్రీవిజయ వంశ రాజు విజయతుంగవర్మన్‌పై ఒకేసారి సముద్రంలో 14 వేర్వేరు ప్రాంతాల నుండి దాడి చేశాడు. ఈ యుద్ధంలో చక్రవర్తి సైన్యం వద్ద పెద్ద పెద్ద పడవలు ఉండేవి. వాటిపై ఏనుగులు, భారీ రాళ్లను విసిరే మంజీరాలు (యుద్ధ పరికరాలు) ఉండేవి. దీని ద్వారా చక్రవర్తి విజయతుంగవర్మన్‌ను సులభంగా ఓడించి బందీగా చేశాడు. ఈ విధంగా చక్రవర్తి అనేక యుద్ధాలను గెలిచి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
చక్రవర్తి రాజేంద్ర చోళ ప్రథమ పాలనలో నిర్మించిన గొప్ప ఆలయాలు ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలలో చేర్చబడ్డాయి. ఈ ఆలయాలు వాటి సంక్లిష్టమైన శిల్పాలు, చోళ కాంస్య కళాఖండాలు, పురాతన శాసనాలకు ప్రసిద్ధి చెందాయి. తిరువతిరై ఉత్సవం సంపన్న తమిళ శైవ భక్తి సంప్రదాయాన్ని కూడా చాటిచెబుతుంది.
ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం చోళ సామ్రాజ్యంపై రెండు భాగాలలో సినిమాలు తీశారు. పొన్నియిన్ సెల్వన్ పేరుతో పార్ట్ 1, పార్ట్ 2గా విడుదలైన ఈ సినిమాలు చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్రను ప్రపంచానికి తెలియజేశాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి.