HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Ajit Pawars Last Post Before His Death

అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !

  • Author : Vamsi Chowdary Korata Date : 28-01-2026 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ajit Pawar Plane Crash
Ajit Pawar Plane Crash

Ajit Pawar  మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ విషాద ఘటన చోటుచేసుకోవడానికి కొన్ని గంటల ముందు, ఆయన తన ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలకు ఒక సందేశం పంపారు. ‘మీ నమ్మకమైన ప్రభుత్వం’ తీసుకున్న పలు నిర్ణయాలను వివరిస్తూ ఆయన చేసిన ఈ పోస్ట్, ఆయన చివరి సందేశంగా మిగిలిపోయింది.

వృత్తి విద్యా శిక్షణా సంస్థల ఏర్పాటు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్టర్ల చెల్లింపుల వ్యవస్థలో మార్పులు, ప్రభుత్వ భూముల లీజుల పొడిగింపు వంటి అంశాలను ఆయన తన పోస్ట్‌లో ప్రస్తావించారు. పైకి ఇది సాధారణ ప్రభుత్వ కార్యకలాపాల సమాచారంగా కనిపించినప్పటికీ, దీని వెనుక ఇటీవలి రాజకీయ పరిణామాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమిలో అంతర్గత విభేదాల తర్వాత, అంతా సవ్యంగా ఉందని చెప్పే ప్రయత్నంగా ఈ పోస్ట్‌ను విశ్లేషకులు భావించారు.

 

Ajit Pawar Tweet

Ajit Pawar Tweet

ఇటీవల జరిగిన ముంబై, పూణె, పింప్రి-చించ్‌వాడ్ సహా 28 నగరాల మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీతో అజిత్ పవార్‌కు తీవ్ర విభేదాలు తలెత్తాయి. సీట్ల పంపకాల విషయంలో బీజేపీ ఆయన్ను పక్కనపెట్టడంతో అజిత్ తన బాబాయ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో తాత్కాలికంగా చేతులు కలిపారు. కుటుంబ కలహాలను పక్కనపెట్టి పూణె, పింప్రి-చించ్‌వాడ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. ఈ ప్రచారంలో ఆయన తన మిత్రపక్షమైన బీజేపీపైనే అవినీతి ఆరోపణలు చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ చేతిలో పవార్ కుటుంబం ఓటమి చవిచూసింది. దీంతో కూటమిలో అజిత్ పవార్ రాజకీయ ప్రాబల్యం గణనీయంగా తగ్గినట్లయింది. ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాల మధ్య ఆయన తిరిగి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఇంతలోనే విమాన ప్రమాదం రూపంలో మృత్యువు ఆయన్ను కబళించడంతో అజిత్‌ రాజకీయ ప్రస్థానం విషాదాంతంగా ముగిసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ajit Pawar
  • Ajit Pawar NCP
  • bjp
  • deputy chief minister
  • Maharashtra
  • Maharashtra politics
  • Municipal Elections
  • Plane Accident
  • political news
  • sharad pawar

Related News

Mamata Banerjee

Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Trinamool Congress పశ్చిమ బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాణిగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో విజయం స

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

  • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

  • కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

  • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd