HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Life Style
  • ⁄Why Do Friendly Dogs Become Ferocious

Dogs: స్నేహంగా ఉండే కుక్కలు.. క్రూరంగా ఎందుకు మారాయి?

మనిషికి నమ్మిన బంటు ఏదైనా ఉందంటే అది కుక్క. మనిషికి అత్యంత విశ్వాసపాత్రంగా ఉండే జంతువు కుక్క.. ఇటీవల కాలంలో కుక్క కాటుకు మరణాలు సంభవించిన ఘటనలు కలకలం

  • By Maheswara Rao Nadella Published Date - 07:30 PM, Tue - 7 March 23
Dogs: స్నేహంగా ఉండే కుక్కలు.. క్రూరంగా ఎందుకు మారాయి?

మనిషికి నమ్మిన బంటు ఏదైనా ఉందంటే అది కుక్క. మనిషికి అత్యంత విశ్వాసపాత్రంగా ఉండే జంతువు కుక్క.. ఇటీవల కాలంలో కుక్క కాటుకు మరణాలు సంభవించిన ఘటనలు కలకలం రేపాయి. హైదరాబాద్ లో కుక్క కరవడంతో ఓ బాలుడు మృతిచెందడం వివాదం సృష్టించింది. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయడం, వ్యాక్సినేషన్ చేయడం మాత్రమేనని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు. ఇంకొందరు మాత్రం కుక్కలను చంపడమే పరిష్కారం అని అంటున్నారు. ఇంతకీ మనుషులకు ఫ్రెండ్లీ గా ఉండే వీధి కుక్కలు (Dogs) ఎందుకు ఇలా క్రూరంగా మారాయి? అవి ఎందుకు రక్తాన్ని కళ్ళజూస్తున్నాయి ? అనే దానిపై హాట్ డిబేట్ జరుగుతోంది.

ఆకలి కేకలు:

ఆకలి.. ఇది మనిషికైనా , వీధి కుక్కకైనా ఒక్కటే. వీధి కుక్కలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటికి తిండి, నీరు పెట్టే వాళ్ళు కరువయ్యారు. ఆఫ్రికా నుంచి ఇండియాకు తెచ్చే క్రూరమైన పులులకు జూలలో భోగభాగ్యాలు కల్పిస్తారు. రోజూ వాటికి మెనూ అమలు చేస్తారు. కానీ రోజూ జనం మధ్య తిరిగే, అత్యంత విశ్వాసపాత్రంగా ఉండే కుక్కలకు పెట్టేందుకు బుక్కెడు బువ్వ ఉండదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి అని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. కుక్కలను పట్టేందుకు స్పెషల్ టీమ్స్ ను రిక్రూట్ చేస్తారు.. కానీ కుక్కలకు నీళ్లు, బ్రెడ్ ఇచ్చేటందుకు స్పెషల్ టీమ్స్ రిక్రూట్ చేయరు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఒక ఐడియా..

విదేశీ జాతి కుక్కలను దత్తత తీసుకోవడానికి జనం ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దేశీ కుక్కలను కూడా జంతు ప్రేమికులు దత్తత తీసుకునేలా ఒక సిస్టం ను దేశంలోని అన్ని స్థానిక సంస్థల్లో డెవలప్ చేయాలి. ఇందులో భాగంగా దేశీ కుక్కలను గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పెంచేందుకు ఫామ్స్ ఏర్పాటు చేయాలి. వాటిలో పెంచే దేశీ కుక్కలకు పౌష్టికాహారం ఇవ్వాలి. వాటిని ఆసక్తి కలిగిన జంతు ప్రేమికులకు దత్తత ఇవ్వాలి. దత్తత ఇచ్చినందుకు నామమాత్రంగా కొంత మొత్తం తీసుకోవాలి. తద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం కూడా లభిస్తుంది.

కొన్ని కేస్ స్టడీలు:

ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా ఆసుపత్రిలో నెలరోజుల పసికందును వీధికుక్కలు (Dogs) కొట్టి చంపాయి. సిరోహి ఘటనలో పసికందు తన తల్లి పక్కనే నిద్రిస్తున్నప్పుడు కుక్కలు ఎత్తుకెళ్లాయి. అతడి మృతదేహం ఆస్పత్రి వార్డు బయట కనిపించింది. ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి రెండు కుక్కలు వెళ్లగా.. వాటిలో ఒకటి పసిపాపతో తిరిగి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. లక్నోలోని జానకీపురంలో ఉన్న ఒక ఎత్తైన భవనంలో గత రెండు నెలల్లో కుక్కల దాడి సంఘటనలు 5 చోటుచేసుకున్నాయి.

Also Read:  Kavitha Case: కవిత అరెస్ట్ కు మరిన్ని ఆధారాలు!బిజినెస్ పార్ట్నర్ పిళ్ళై కి ఈడీ బేడీలు

Telegram Channel

Tags  

  • benefits
  • dogs
  • Ferocious
  • friendly
  • Life Style
  • tips
  • Tricks
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Control Cholesterol with Onions: ఉల్లిపాయలతో కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందా? షుగర్ రోగులకు మంచిదా?

Control Cholesterol with Onions: ఉల్లిపాయలతో కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందా? షుగర్ రోగులకు మంచిదా?

ఉల్లిపాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉల్లి తినడం, కొలెస్ట్రాల్ మధ్య సంబంధం ఉంటుంది.ఉల్లిపాయలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో..

  • Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఎలా తగ్గించుకోవాలో తెలుసా!

    Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఎలా తగ్గించుకోవాలో తెలుసా!

  • Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

    Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

  • April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే

    April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే

  • Chaitra Navratri Special: సాత్విక, రాజస, తామస ఆహారం మధ్య తేడా? ప్రయోజనాలు?

    Chaitra Navratri Special: సాత్విక, రాజస, తామస ఆహారం మధ్య తేడా? ప్రయోజనాలు?

Latest News

  • Gold Price Today: మహిళలకు కన్నీళ్లు పెట్టిస్తున్న బంగారం ధరలు..!

  • Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!

  • Putin Arrest Warrant: పుతిన్‌ను అరెస్ట్ చేస్తే యుద్ధం తప్పదు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా మాజీ అధ్యక్షుడు

  • Anuradha @ TDP: చంద్రబాబు సంచలనాల్లో అనురాధ ఎపిసోడ్

  • Jharkhand: 4 రోజుల నవజాత శిశువు మృతి.. పోలీసులే కారణమా..?

Trending

    • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: