HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >What Foods Increase Body Strength In Male

Body Strength In Male: బలహీనతతో బాధపడుతున్నారా..? వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఫుల్ ఎనర్జీ..!!!

మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే శరీరం బలహీనతకు గురువుతుంటుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోతాం.

  • By hashtagu Published Date - 03:00 PM, Sun - 21 August 22
  • daily-hunt
Male Muscle
Male Muscle

మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే శరీరం బలహీనతకు గురువుతుంటుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోతాం. దీంతో ఏకగ్రత కూడా పూర్తిగా దెబ్బతింటుంది.కొంతమంది పురుషులు తమ ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ద చూపిస్తుంటారు. దానికి తగ్గట్లుగానే జిమ్, డైట్ చేస్తుంటారు. కానీ ఇఫ్పటికీ కొంతమంది పురుషులు ఎలాంటి ఫిట్ నెస్ పాటించకపోవడంతో అధికబరువుతో బాధపడుతుంటారు.

మరికొంతమంది శరీరం మందగించి వికారంగా కనిపిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం ఎలా అని ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తేలికగా జీర్ణమయ్యే..శరీరానికి శక్తిని అందించే ఆహారపదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అసలు శరీరంలోని బలహీనతకు కారనం ఏంటీ…దాన్ని దూరం చేయడానికి ఎలాంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.

ప్రోటీన్ పౌడర్ :
శరీరం చాలా మందంగా, బలహీనంగా ఉన్న పురుషులు తమ శరీరానికి మరింత శక్తిని అందంచేందుకు పలు సప్లిమెంట్లు, ప్రొటీన్ పౌడర్లను తీసుకోవడం మొదలుపెడతారు. కానీ ఇవి చాలామంది పురుషుల్లో వాటి దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ , నట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మీ శరీరం సన్నగా, బలహీనంగా ఉన్నట్లయితే, మీరు ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ నట్స్ తీసుకోవాలి. దీని కోసం మీరు బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, డ్రై ఫిగ్స్ మొదలైన వాటిని తీసుకోవచ్చు. దీనితో పాటు, మీరు పొద్దుతిరుగుడు, జాక్‌ఫ్రూట్, గుమ్మడి గింజలను కూడా తినవచ్చు. వీటన్నింటినీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఫుల్ ఎనర్జీ వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంటారు.

వెల్లుల్లి:
మీ శరీరం బలహీనంగా ఉంటే మీ రెగ్యులర్ డైట్‌లో వెల్లుల్లిని చేర్చుకోండి. వెల్లుల్లి పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ శారీరక శక్తిని పెంచుకోవడానికి, మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినవచ్చు. దీని కోసం మీరు 3-4 వెల్లుల్లి రెబ్బలను తీసి గోరువెచ్చని నీటితో త్రాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల శక్తితోపాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి.

అరటిపండు:
మీ శారీరక బలాన్ని పెంచుకోవడానికి అరటిపండును మీ ఆహారంలో చేర్చుకోండి. అరటిపండులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. ఇందుకోసం రోజూ 1 లేదా 2 అరటిపండ్లను పాలలో కలిపి తినవచ్చు.

అశ్వగంధ తినండి:
అశ్వగంధ ఆయుర్వేదంలో పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అశ్వగంధలో మాంసకృత్తులు, శక్తి, ఐరన్ , కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు బలహీనంగా ఉంటే, మీరు ప్రతిరోజూ అశ్వగంధ తినవచ్చు. దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకుని, దానికి 1-2 స్పూన్ల అశ్వగంధ పొడిని కలపండి. ప్రతిరోజూ పడుకునేముందు తాగండి. అశ్వగంధను పాలలో కలిపి తీసుకుంటే మీ బరువు క్రమంగా పెరుగుతుంది. దీంతో పాటు బలహీనత, అలసట తొలగిపోతుంది.

ధాన్యాలు :
చాలా మంది ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కెఫిన్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటుంటారు. దీని వల్ల మీ బరువు పెరుగుతారు కానీ శారీరక బలం ఉండదు. మీకు ఎనర్జీ కావాలంటే వీటన్నింటికి బదులు ధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

పైన తెలిపిన వాటితో పాటుగా ఖర్జూరం, అత్తి పండ్లను, తెల్లటి ముస్లీ, అరటిపండు, నెయ్యి, పాలు, ఉల్లిపాయలు, జామకాయ మొదలైనవి తినవచ్చు. ఈ పదార్థాలన్నీ తినడం వల్ల పురుషుల బలహీనత తొలగిపోయి శరీరానికి బలం చేకూరుతుంది. ఈ హోం రెమెడీస్ పురుషుల సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడతాయి. కానీ మంచి ఆహారం, జీవనశైలిని అవలంబించిన తర్వాత కూడా మీరు బలహీనంగా ఉంటే, మీరు ఒకసారి వైద్యుడిని సంప్రదించండి.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banana
  • Body Strength In Male
  • Dry Fruits
  • foods
  • garlic
  • health
  • Increase
  • lifestyle
  • protein powder

Related News

Cancer

Cancer: క్యాన్సర్ ముప్పును పెంచే 5 ఆహారాలీవే?!

ప్లాస్టిక్ సీసాలో నీరు తాగడం కూడా క్యాన్సర్‌కు ఒక దాగి ఉన్న కారణం కావచ్చు. ప్లాస్టిక్‌లో ఉండే రసాయనాలు నీటితో పాటు శరీరంలోకి చేరి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. దీనికి వెంటనే దూరంగా ఉండటం అవసరం.

  • ‎foods For Better Sleep

    ‎Foods for Better Sleep: రాత్రిళ్ళు నిద్ర సరిగా పట్టడం లేదా.. అయితే ఈ ఫుడ్స్ తినాల్సిందే!

  • ‎pregnancy Tips

    ‎Pregnancy Tips: ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా.. అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాల్సిందే!

  • Curry Leaves

    Curry Leaves: 30 రోజుల్లో మీ జుట్టు పెర‌గాలంటే.. కరివేపాకును ఉపయోగించండిలా!

  • Health Tips

    Health Tips: జ‌లుబు, గొంతునొప్పితో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

Latest News

  • Pawan : రాజకీయాలు వదిలేస్తా.. పవన్ ప్రకటనతో అంత షాక్

  • ‎Intestinal Worms: కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

  • ‎Vastu Tips: ఏంటి.. ఈ ఒక్క పూల మొక్కను నాటితే కోటీశ్వరులు అవుతారా.. కాసుల వర్షం కురుస్తుందా?

  • ‎Naraka Chaturdashi: ఈ ఏడాది నరక చతుర్దశి ఎప్పుడు? అక్టోబర్ 19నా లేక 20నా.. ఈరోజు పాటించాల్సిన నియమాలు ఇవే!

  • India vs WI: విండీస్‌ను భార‌త్ క్లీన్ స్వీప్ చేయగ‌ల‌దా? రేపట్నుంచే రెండో టెస్ట్‌!

Trending News

    • Prithvi Shaw: పృథ్వీ షా.. ఆట కంటే వివాదాలే ఎక్కువ ఉన్నాయిగా!

    • Jio Diwali: జియో యూజ‌ర్ల‌కు భారీ ఆఫ‌ర్‌.. ఏంటంటే?

    • Mukesh Ambani: ఫోర్బ్స్ 2025.. భారత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ అగ్రస్థానం!

    • Womens Cricket: మహిళా క్రికెట్‌కు ఐసీసీ కీల‌క ప్రకటన!

    • PM Kisan Yojana: దీపావళిలోపు పీఎం కిసాన్ నిధులు.. ఈ 5 పనులు చేయకపోతే డబ్బులు రావు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd