Quinoa for Weight Loss: బరువు తగ్గేందుకు క్వినోవా – మీ డైట్‌లో తప్పనిసరి ఆహారం
గ్లూటెన్ ఉండకపోవడంతో గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి ఇది బాగుంది. మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి.
- By Dinesh Akula Published Date - 12:54 PM, Tue - 23 September 25

Quinoa for Weight Loss: క్వినోవా అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది, బరువు తగ్గించడంలో సహాయపడే అద్భుతమైన ఆహారం. ఇది ఒక గింజా అయినప్పటికీ చాలామంది ధాన్యంగా పరిగణిస్తారు. మూలంగా దక్షిణ అమెరికాలో పుట్టుకైన ఈ ఆహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘సూపర్ ఫుడ్’గా పేరొందింది.
క్వినోవాలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎంతో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ‘పూర్తి ప్రోటీన్’గా పేరుగాంచింది ఎందుకంటే ఇందులో తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి, ఇవి శరీరం తయారు చేసుకోలేని పదార్థాలు కావడంతో ఆహారంలో తప్పక తీసుకోవాలి. ఇది ప్రత్యేకంగా శాకాహారులకు చాలా ముఖ్యమైన ఆహారం.
ఇంకా, క్వినోవాలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిగా ఉంటుంది, దాంతో పాటు మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. గ్లూటెన్ ఉండకపోవడంతో గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి ఇది బాగుంది. మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి.
క్వినోవాను బాగా ఉడికించి అన్నంలా తినవచ్చు. సలాడ్‌లు, సూప్‌లు, స్మూతీలలో కూడా ఉపయోగించవచ్చు. ఉదయం అల్పాహారంగా పాలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవడం మంచి ఆప్షన్.
క్వినోవా వండడం సులభం. ఒక కప్పు క్వినోవాకు రెండు కప్పుల నీరు, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మంటపై ఉడికించి నీరు మరిగి పోయాక ఐదు నిమిషాలు ఆవిరి మీద ఉంచాలి. తర్వాత తినేందుకు సిద్ధంగా ఉంటుంది.
ఈ ప్రయోజనాలతో కూడిన క్వినోవాను మీ రోజువారీ డైట్‌లో చేర్చుకొని ఆరోగ్యాన్ని మెరుగుపర్చండి, బరువు తగ్గడం సులభం అవుతుంది.