Nakki Lake : నక్కి సరస్సు, మౌంట్ అబూ
పర్యాటకులు, స్థానిక ప్రజలు సందర్శించే నక్కి సరస్సు మౌంట్ అబూ (Nakki Lake, Mount Abu) లోని ఒక ప్రముఖ ఆకర్షణ.
- Author : Vamsi Chowdary Korata
Date : 17-10-2023 - 4:36 IST
Published By : Hashtagu Telugu Desk
Nakki Lake, Mount Abu : పర్యాటకులు, స్థానిక ప్రజలు సందర్శించే నక్కి సరస్సు మౌంట్ అబూ (Nakki Lake, Mount Abu) లోని ఒక ప్రముఖ ఆకర్షణ. ఇది 1200 మీ. ఎత్తు లో నున్న భారతదేశపు ఒకే ఒక్క కృత్రిమ సరస్సు. ఇది సుందరమైన కొండల నడుమ వున్న ఒక అందమైన నిర్మలమైన ప్రదేశం క్రూరులైన రాక్షసుల బారి నుండి తమను తాము కాపాడు కోవడానికి దేవతలు తమ నఖాలు (గోర్లు) తో ఈ సరస్సు ను తవ్వారని, అందువలననే దీనికి ఆ పేరు వచ్చిందని పురాణాలలో తెలుపబడింది. వేరొక పురాణ గాథ ప్రకారం దిల్వార జైన దేవాలయాల శిల్పి రసియ బాలం దీనిని ఒక్క రాత్రి లోనే తవ్వాడు.
We’re now on WhatsApp. Click to Join.
మహాత్మాగాంధీ స్మారకార్థం నిర్మించిన గాంధీ ఘాట్ ను కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. 1948 ఫిబ్రవరి 12 న ఈ సరస్సులో అతని అస్థికలను నిమజ్జనం చేశారు. పర్వతారోహణ చేయాలనుకునే పర్యాటకులు, సాహస ప్రియులకు ఈ సరస్సు దగ్గర లోని అనేక రాతి కొండలు ఒక అవకాశాన్ని కల్పిస్తాయి. నక్కి లేక్ (Nakki Lake) వద్ద ఉన్నప్పుడు బోటింగ్ చేస్తూ ఈ సరస్సు లోని స్వచ్చమైన ప్రశాంతమైన నీటిని ఆస్వాదించగలగడ౦ ఇంకొక ఆసక్తి కరమైన అంశం.
Also Read: Dilwara Jain Temples : దిల్వార జైన దేవాలయాలు, మౌంట్ అబూ