HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >How To Know The Ginger Is Fake

Fake Ginger: నకిలీ అల్లాన్ని తెలుసుకోవడం ఎలా?

చలికాలంలో ఎక్కువగా దొరికే అల్లంని మనం రకరకాలుగా వాడతాం. కుకీ నుంచి కాక్‌టెయిల్, టీల వరకూ అల్లంని చలికాలంలో ఎన్నో రకాలుగా వాడతారు.

  • Author : Maheswara Rao Nadella Date : 01-12-2022 - 8:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ginger Side Effects
Image:

ప్రస్తుత ఈ చలికాలంలో నకిలీ అల్లం ఎక్కువగా వస్తోంది. చలికాలంలో ఎక్కువగా దొరికే అల్లంని మనం రకరకాలుగా వాడతాం. కుకీ నుంచి కాక్‌టెయిల్, టీల వరకూ అల్లంని చలికాలంలో ఎన్నో రకాలుగా వాడతారు. ఇది స్పైసీ ఫ్లేవర్‌తో మంచి రుచిని కలిగి ఉంటుంది. ఆహారంలో వాడినప్పుడు శరీరంలో మంటను తగ్గిస్తుంది. వేడిని, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ రోజుల్లో మార్కెట్‌లో నకిలీ అల్లం (Fake Ginger) దొరుకుతుండడంతో రుచి, ఘాటు ఉండడం లేదు. దీనిని తినడం వల్ల మన హెల్త్‌పై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి నకిలీ అల్లాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిజమైన అల్లం, నకిలీ అల్లం మధ్య తేడాని కనుక్కునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పొట్టు:

అల్లం పై పొట్టు నీట్‌గా ఉంటే దానిని అనుమానించాల్సిందే. ఎందుకంటే నకిలీ అల్లం (Fake Ginger)ని క్లీన్ చేసేందుకు కొన్ని రకాల యాసిడ్స్ ఉపయోగించినప్పుడు మాత్రమే దానిపై ఉన్న మురికి పోతుంది. కాబట్టి, దానిని అనుమానించాల్సిందే.

దళసరి పొట్టు:

అల్లం చర్మంపై తొక్క సన్నగా ఉంటుంది. గోటితో గుచ్చి వాసన చూసినప్పుడు ఘాటుగా ఉంటుంది. నకిలీ అల్లం (Fake Ginger) పై పొట్టు దళసరిగా ఉంటుంది. దీనిని గిచ్చడం కాస్తా కష్టమే.

ఘాటు వాసన:

చివరగా, అల్లం వాసన చూడడం. ముందుగా చెప్పినట్లుగా అల్లం ఘాటైన వాసనని కలిగి ఉంటుంది. అయితే, నకిలీ అల్లం (Fake Ginger) ఎలాంటి వాసన ఉండదు. కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే చెట్టు వేర్లని జనాలు అమ్ముతున్నారు. వీటికి ఎలాంటి వాసన ఉండదు. నిజమైన అల్లంలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు.

విరిస్తే:

మీరు అల్లాన్ని విరిచినప్పుడు దాని నుంచి పీచులా సన్నని దారలు వస్తాయి. అది నిజానికి ఫైబర్. కానీ, నకిలీ అల్లం (Fake Ginger)లో ఇవి ఉండవు.

ఇలా నకిలీ అల్లాన్ని (Fake Ginger) తేలికగా గుర్తించొచ్చు. అదే విధంగా, అల్లంని మన ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇందులోని ప్రత్యేక గుణాలు మనల్ని అన్నీ సీసన్స్ లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. కాబట్టి అల్లం ఆరోగ్యానికి చాలా మంచింది. కేవలం ఇక్కడే కాదు. విదేశీయులు సైతం అల్లాన్ని విరివిగా వాడతారు. ఇందులోని గొప్ప గుణాలు మనలో ఇమ్యూనిటీని పెంచేలా చేస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడేవారు అల్లంతో టీ చేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. గొంతు సమస్యల్ని దూరం చేయడంలో అల్లం బాగా పని చేస్తుంది. అంతేకాదు అల్లాన్ని రెగ్యులర్‌గా తింటే జీర్ణ సంబంధ సమస్యలు కూడా దూరమవుతాయి. గట్ హెల్త్ బావుంటుంది. అందుకే దీనిని వాడడం చాలా మంచిది. ముఖ్యంగా చలికాలంలో జలుబుగా అనిపించినప్పుడు ఓ చిన్న అల్లం ముక్కని చప్పరిస్తుంటే ఆ సమస్య దూరమవ్వడం ఖాయం.

చూశారుగా అల్లంతో ఉపయోగాలు, అలానే చిట్కాలు. ఈ టిప్స్‌తో నకిలీ అల్లాన్ని తేలికగా కనుక్కోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • ginger
  • health
  • health benefits
  • Life Style

Related News

What happened as a result of engaging in sex non-stop for five hours?

Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

సెక్స్‌లో ఆమె స్వర్గపు అంచులను చూడాలనుకుంది. చివరికి ఈ లోకాన్నే విడిచింది. నిర్విరామంగా సెక్స్ చేయాలనే ఆమె కోరికే ప్రాణాలను హరించింది. కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళ ఒక హోటల్‌లో రూమ్ తీసుకుంది. అక్కడ తన పార్టనర్‌తో ఏకాంతంలో మునిగి తేలింది. ఎక్కువ సేపు సెక్స్ చేయాలని అతడిపై ఒత్తిడి చేసింది. దీంతో ఇద్దరూ డ్రగ్స్ తీసుకుని రతి క్రీడలో మునిగి తేలారు. అలా ఐదు గంటల పాటు నిర్వి

  • Does eating boiled eggs prevent heart problems?

    Eggs Benefits: ఉడికించిన కోడిగుడ్లు తింటే గుండె సమస్యలు రావా..?

Latest News

  • Apache Helicopter: హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్!

  • ACB Raids: ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌ నాయక్‌ పై ఏసీబీ సోదాలు

  • Bhatti Vikramarka: బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్

  • Visakhapatnam Steel Plant: కన్నీళ్లు పెట్టిస్తున్న స్టీల్ ప్లాంట్ బాధితుడు.. తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ

  • Hardik Pandya: ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd