Healthy Breakfast Ideas: హెల్తీ డే కోసం.. 5 హెల్తీ బ్రేక్ ఫాస్ట్స్!!
- By Hashtag U Published Date - 08:00 AM, Wed - 24 August 22
ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే ఆ ఎనర్జీ లెవల్స్ వేరు..
ఎంతో ఉత్సాహంగా, జోష్ తో రోజువారీ పనుల్లో మునిగిపోవచ్చు..
టైం లేకపోవడంతో చాలామంది టిఫిన్ చేయకుండానే రోజువారీ పనుల్లో మునిగిపోతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. సకాలంలో అల్పాహారం తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ వంటివి తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం వేళ అతి తక్కువ సమయంలో వండేందుకు వీలైన 5 హెల్తీ ఫుడ్స్ గురించి వారు వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1.ఎగ్ టోస్ట్
ఉదయం వేళ నోరూరించే ఎగ్ టోస్ట్ తింటే భళేగా ఉంటుంది. దీన్ని వండటం కూడా చాలా ఈజీ. ముందుగా ఎగ్ ను పగలగొట్టి ఒక పాత్రలో వేసుకొని.. అందులో పెప్పర్ పౌడర్, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దాన్ని డ్రై గా ఉండే పెనంలో వేసి వేయించాలి. అనంతరం అందులో క్యారెట్ ముక్కలు, కొత్తిమీర కలపాలి.
ఆ తర్వాత రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో చీజ్ లేయర్స్ ను రెండు వైపులా పరిచి.. అందులో ఎగ్ వేపుడును వేయాలి. దీంతో ఎగ్ టోస్ట్ రెడీ అవుతుంది. దీన్ని తినడం వల్ల ప్రోటీన్లు సమృద్ధిగా మన శరీరానికి లభిస్తాయి. పైగా తక్కువ టైంలో వండటం అయిపోతుంది.ఇక ఈ ఎగ్ టోస్ట్ తో పాటు కొత్తిమీర, పుదీనా కలిపిన చట్నీ ఉంటే అదిరిపోతుంది.
2.పెసరట్టు
మార్నింగ్ టైంలో పెసరట్టును మించిన టేస్టీ ఫుడ్ మరొకటి ఉండదు. మన దేశంలో ఫేవరేట్ టిఫిన్ ఐటమ్ ఇది.కొత్తిమీర, పుదీనా తో కూడిన గ్రీన్ చట్నీ ఉంటే.. పెసరట్టు టెస్టు అదిరేట్టుగా మారుతుంది. ఇది తిని టమాటో – క్యారెట్ జ్యూస్ తాగితే చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది.
3.గోబీ పరాఠా
గోబీ పరాఠా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పెరుగుతో లొట్టలేసుకొని తినొచ్చు. బూడిద గుమ్మడి కాయ జ్యుస్ కూడా చేసుకొని తాగితే.. గోబీ పరాఠా పరమార్ధం నెరవేరుతుంది.
4.బాయిల్డ్ ఎగ్
బాయిల్డ్ ఎగ్.. ఇది చాలా లైటర్ టిఫిన్. దీంతోపాటు 5 నుంచి 8 బాదం పండ్లు తినాలి. ఆ తర్వాత టొమాటి జ్యుస్ తాగితే కడుపు చల్లబడుతుంది. మంచి స్టెమినా వస్తుంది. శిల్పా శెట్టి వంటి ఎందరో హీరోయిన్స్ బాయిల్డ్ ఎగ్ ను టిఫిన్ లో తీసుకుంటారు. దీంతోపాటు ఫ్రూట్ జ్యుస్, వెజిటబుల్ జ్యుస్ తాగుతుంటారు.
5.ఫ్రెష్ ఫ్రూట్ బౌల్
ఫ్రెష్ ఫ్రూట్ బౌల్ ను మార్నింగ్ టిఫిన్ ఐటమ్ గా తీసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ ను కట్ చేసి.. దీన్ని చిటికెలో తయారు చేసుకోవచ్చు. క్యారెట్, దానిమ్మ, యాపిల్, ద్రాక్ష, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్ , అరటి వంటివన్నీ కలిపి ఫ్రూట్ బౌల్ రెడీ చేసుకోవచ్చు.
Related News
Fitness : తిన్న తర్వాత మీకు నిద్ర వస్తోందా? అయితే.. ఇలా ప్రయత్నించండి..!
భోజనం చేసిన తర్వాత నిద్రపోవడం పనిలో మీ ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది.