Cholesterol Cleaning Tips: చెడు కొలెస్ట్రాల్‌ను క్లీన్ చేయడానికి ఈ చిట్కాలను అనుసరించండి..
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి.. ఆయుర్వేద నివారణలు సహాయపడతాయని ఆయుర్వేద డాక్టర్ కపిల్ త్యాగి అన్నారు. ఇవి ఐదు రోజుల్లో కొలెస్ట్రాల్...
- By Maheswara Rao Nadella Published Date - 07:00 PM, Fri - 17 March 23

అధిక కొలెస్ట్రాల్ (Cholesterol) స్థాయి మీ గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే.. గుండెపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ వచ్చే ముప్పు పెరుగుతుంది. చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, శారీర శ్రమ లేకపోవడం, కొన్ని ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ చరిత్ర కారణంగా.. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. NCBI నివేదిక ప్రకారం, భారతదేశం నగరాల్లో 25-30% మంది, గ్రామాల్లో 15-20% మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రశాంతంగా నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించుకుంటే.. కొలెస్ట్రాల్ (Cholesterol) సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ (Cholesterol) స్థాయిలను తగ్గించడానికి.. ఆయుర్వేద నివారణలు సహాయపడతాయని ఆయుర్వేద డాక్టర్ కపిల్ త్యాగి అన్నారు. ఇవి ఐదు రోజుల్లో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయని అన్నారు.
పసుపు:
పసుపు ధమనుల గోడలపై పేరుకునే ఫలకాన్ని తగ్గించి, సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను విచ్ఛిన్నం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ సీరం LDL, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గింస్తుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. మీరు చిటికెడు పసుపు గోరువెచ్చని నీటిలో కలిపి రోజూ తీసుకుంటే.. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
మెంతులు:
ధనియాలు:
ధనియాలలో హైపోగ్లైసీమిక్ గుణాలు ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ధనియాల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని కాపర్, జింక్, ఐరన్ వంటి మినరల్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒక స్పూన్ ధనియాలు.. నీటిలో వేసి రెండు నిమిషాలు పాటు మరిగించి.. వడగాట్టాలి. ఇలా తాయారు చేసుకున్న నీటిని రోజూ తాగితే.. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
తేనె:
తేనె రక్త నాళాల లైనింగ్‌లోకి చెడు కొలెస్ట్రాల్ చేరకుండా నిరోధిస్తుంది. తేనె ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను 6%, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను 11% తగ్గించి, హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు స్పష్టం చేశారు. తేనెలో కొవ్వులు సున్నా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. మీరు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటే.. రోజూ ఉదయం ఖాళీ కడుపతో 1 కప్పు గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ తెనె, నిమ్మరసం, కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని తాగండి.
వెల్లుల్లి:
పచ్చి వెల్లుల్లి.. గుండె సంబంధ వ్యాధుల(CVD) నుంచి రక్షించడానికి మెరుగ్గా పనిచేస్తుందని NCBI నివేదిక వెల్లడించింది. చెడు కొలెస్ట్రాల్ (LDL-C), ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. ప్రతి రోజూ సగం వెల్లుల్లి రెబ్బను తీంటే.. కొలెస్ట్రాల్ స్థాయి 10% తగ్గుతుందని నివేదిక స్పష్టం చేసింది. వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది. ఇది రక్తనాళాలలో పేరుకున్న కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. 6-8 వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసి 50 మి.లీ పాలు, 200 మి.లీ నీటిలో వేసి మరిగించి తాగండి. వెల్లుల్లిలో హ్యూమన్ 3-హైడ్రాక్సీ-3-మిథైల్‌గ్లుటరిల్-కోఎంజైమ్ A (HMG-CoA), స్క్వాలీన్ మోనో ఆక్సిజనేస్ వంటి అంశాలు ఉన్నాయి, ఇవి కొలెస్ట్రాల్‌ను నివారించడంలో సహాయపడతాయి.
యాపిల్:
యాపిల్స్‌లో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోని ఫ్లేవనాయిడ్స్ యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇవి మీ ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. మీరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే.. రోజుకొక యాపిల్ తినడం మంచిది.
బీట్‌రూట్:
బీట్‌రూట్‌లో కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి. హైపర్‌టెన్షన్ తగ్గిస్తాయి. బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్స్ రక్త ప్రసరణను సులభతరం చేయడమే కాకుండా మొత్తం బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. దీంతో హైపర్‌టెన్షన్ నియంత్రణలో ఉంటుంది. మీ సలాడ్‌లో బీట్‌రూట్ యాడ్ చేసుకోండి.
Also Read: Summer Rotis: ఎండాకాలంలో మీకు చలువ వచ్చే రోటీలు ఇవీ

Related News

Healthy Sleep Tips: 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే PAD ముప్పు.. ఏమిటది..?
8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వచ్చే ప్రమాదం ఉంటుందని స్వీడన్లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.