HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Entering A New House But These 9 Types Of Things Must Be Remembered

House : కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నారా..? అయితే ఈ 9 రకాల విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి..

కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి (House) గృహప్రవేశం చేసినప్పుడు అనేక రకాల సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు.

  • Author : Naresh Kumar Date : 03-01-2024 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Entering A New House.. But These 9 Types Of Things Must Be Remembered..
Entering A New House.. But These 9 Types Of Things Must Be Remembered..

Tips to follow while Entering into New House : ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కల అన్నది ఉంటుంది. చనిపోయే లోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కలలు కంటూ ఉంటారు. ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి (House) గృహప్రవేశం చేసినప్పుడు అనేక రకాల సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంట్లోకి (House) ప్రవేశించినప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి అంటున్నారు పండితులు. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు, శుభ దినం, శుభ ముహూర్తంతో కొత్త గృహ ప్రవేశం చేయడం చాలా ముఖ్యం. కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు, సంఖ్యా శాస్త్రం, చంద్ర దశ, క్యాలెండర్ లేదా రాశి ఆధారంగా గ్రహ ప్రవేశ ముహూర్తం నిర్ణయిస్తారు. ఏదైనా ఒక శుభదినం లేదా శుభ తిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, సంతోషాలు నెలకొంటాయని హిందువుల‌ విశ్వాసం. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువుల్లో ఉపయోగించడం మంచిది. చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. చీపురు పట్టుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం. ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు.

ధాన్యంతో కొత్త గృహ ప్రవేశం చేయడం వల్ల ఇంట్లో తిండికి లోటుండదని నమ్ముతారు. అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. హిందూమతంలో కొబ్బ‌రి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు. కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ క‌టాక్షం, శ్రేయస్సు లభిస్తుంది. కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, ఆ ఇంట్లోని కొత్త పొయ్యిపై పాలు కాచే ఆచారం ఉంది. ఇది కొత్త ఇంటికి భ‌గ‌వంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత, ఆ పాలను ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు.

ఆ తర్వాత ఇంటికి వచ్చిన అతిథులకు ఆ పాలతో తీపి వంట‌కం త‌యారు చేసి పెడ‌తారు. అలాగే కొత్త ఇల్లు కట్టినప్పుడు, ఆవు అంటే కామధేనువుని గృహ‌ ప్ర‌వేశం రోజు తీసుకువెళతారు. ఈ సమయంలో ఆవును పూజించి, పూలతో, పసుపు, కుంకుమలతో అలంకరించి ఇంటి ప్రధాన ద్వారం గుండా తీసుకెళ‌తారు. ఆవును ఇంటికి తీసుకెళ్లడం ద్వారా మూడు కోట్ల మంది దేవతలు ఇంట్లోకి ప్రవేశించినట్లే అని నమ్ముతారు. తర్వాత ఆవుకు మిఠాయిలు నైవేద్యంగా పెట్టి ఆ రోజు తొలి ఆహారాన్ని ఆవుకు నైవేద్యంగా పెట్టి హారతి ఇస్తారు. గృహ ప్రవేశ పూజ అనేది హిందూ దేవతలు నుంచి దీవెనలు పొందేందుకు, ఇంటిని రక్షించడానికి, సానుకూల శక్తులతో నింపడానికి నిర్వ‌హించే పవిత్రమైన కార్య‌క్ర‌మం.

కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు, శక్తిని శుద్ధి చేయడానికి, ఇంటిని సానుకూల శక్తితో నింపడానికి పూజ సమయంలో కొత్త కలశాన్ని ఉంచి గణ‌ప‌తి పూజ, వాస్తు దోష పూజ, నవగ్రహ శాంతి పూజల తర్వాత హవనం నిర్వ‌హిస్తారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టగానే దేవుడి ప‌టం తెచ్చి పెడతారు. కొత్త ఇంట్లోని దేవుని గదిలో భ‌గ‌వంతుడి చిత్ర‌ప‌టాన్ని ఉంచ‌డం చాలా శుభప్రదం. కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దానధర్మాలు చేస్తారు. ఈ సమయంలో సుమంగళిలకు పసుపు, కుంకుమ, కంకణాలు, వస్త్రాలు తదితరాలను వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు. పేదలకు కూడా వారికి చేతనైనంత డబ్బు, భోజనం, దుస్తులు ఇస్తారు. బ్రాహ్మణులకు భోజనం పెట్టి దుస్తులు అంద‌జేస్తారు.

Also Read:  Turmeric Tips : ముఖానికి పసుపు రాసుకుంటున్నారా..? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • devotional
  • entering
  • god
  • goddess
  • lifestyle
  • Lord
  • New house
  • Remember
  • things
  • tips

Related News

Why should a husband and wife stay apart during the month of Ashadha?

Ashada Masam 2026: ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు దూరంగా ఉండాలి?

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఉండనుంది. ఈ మాసం రాగానే కొత్తగా పెళ్లైన దంపతులను ఒకరికొకరు దూరంగా ఉంచడం, వధువును పుట్టింటికి పంపించడం మన సమాజంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే దీని వెనుక కేవలం సెంటిమెంట్లు, నమ్మకాలు మాత్రమే కాకుండా పూర్వీకులు ఆలోచించిన అద్భుతమైన వైజ్ఞానిక, సామాజిక కారణాలు దాగి ఉన్న

  • Why is *Thamboolam* (betel leaves and areca nuts) offered? On what occasions is it given? What is its significance?

    Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • 7 Tips to Curb Insomnia for Stress Management

    Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

  • Is this what the abode of Lakshmi looks like?

    Lakshmi Nivasam: లక్ష్మీ నివాసం ఇలా ఉంటుందా..?

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd