Weight Loss: చెమట చిందిస్తే.. బరువు తగ్గొచ్చా ?
వ్యాయామాలను చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం సహజమే.
- By Hashtag U Published Date - 09:30 PM, Fri - 29 July 22

వ్యాయామాలను చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం సహజమే. అయితే చెమటలు పట్టడం వల్ల వెయిట్ లాస్ జరుగుతుందా ? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంటుంది. దీనికి సమాధానం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
చెమటకు కారణాలు..
శారీరక వ్యాయామాలను చేసినప్పుడు చెమటలు పట్టడం అనేది ఒక బయలాజికల్ ప్రక్రియ.
చెమటలో నీరు, సోడియం క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎలిమెంట్స్ ఉంటాయి. సహజంగా ఎప్పుడైతే వాతావరణంలో మార్పులు జరుగుతాయో.. టెంపరేచర్ బాగా పెరుగుతుందో అప్పుడు చెమటలు పడతాయి. దీనివల్ల బాడీలోని క్యాలరీలు కరుగుతాయి. కానీ బరువు తగ్గరు. కొన్ని ప్రదేశాల లో హ్యుమిడిటీ శాతం ఎక్కువగా ఉండటం వల్ల చెమటలు పడతాయి. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్ పెరిగినప్పుడు మన శరీర టెంపరేచర్ పెరిగి పోతుంది. దానివల్లనూ చెమటలు పడతాయి.
జిమ్ చేస్తే చాలా?
జిమ్ ఒక్కటే చేయడం వల్ల బరువు తగ్గలేరని గుర్తుంచు కోవాలి. తేలిక పాటి వ్యాయామాలు, రన్నింగ్, జాకింగ్, స్విమ్మింగ్, యోగా, ఆటలు ఆడటం వంటివి కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల ఫిట్నెస్ సైతం పెరుగుతుంది. కేలరీలను కరిగించడానికి కేవలం శారీరక వ్యాయామాలను చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే మార్గం. అనవసరమైన కొవ్వు ని కరిగించుకోవడానికి ఆరోగ్యపు అలవాట్లను చేసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ ఎంతో అవసరం.
బేకరీ ఐటమ్స్ కు దూరం..
బేకరీ ఐటమ్స్ లో చక్కెరలు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. వీటి వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అలాంటి ఆహారాలను తీసుకోకపోవటం మంచిది. రోజుకు 10వేల అడుగులు నడవటం, రోజుకు ఎనిమిది గంటలు నిద్రించటం వంటి వాటి వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.