HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Do You Know The Reason For High Blood Pressure

Blood Pressure: రక్తపోటు పెరగడానికి కారణం తెలుసా?

  • Author : Vamsi Chowdary Korata Date : 02-03-2026 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
High Blood Pressure Symptoms
High Blood Pressure Symptoms

High Blood Pressure Symptoms  బ్లడ్ ప్రెజర్, దీనినే రక్తపోటు అని కూడా అంటారు. చాలామందికి ఈ సమస్య ఉంటుంది. ఊరికే కోపం రావడం, అరవడం చేస్తుంటారు ఇలాంటివారు. చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవ్వడాన్ని చూసి చాలామంది బీపీ పెరిగిందా ఏంటి అని కామెంట్ కూడా చేస్తుంటారు. నిజమే, మరి బీపీ పెరిగినవారు ఇలానే బిహేవ్ చేస్తారు. ఇది బాహ్యంగా కనిపించే లక్షణం. కానీ, లోలోపల చాలా డ్యామేజ్ జరుగుతుంది. బీపీ పెరగడాన్ని గమనించకపోతే చాలా సమస్యలొస్తాయి. ఇంటర్నల్‌గా అవయవాలన్నీ దెబ్బతింటాయి.

హైబీపీ ఉంటే అది చాలా అవయవాల పనితీరుపై ఎఫెక్ట్‌ను చూపిస్తుంది. గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ళు ఇవన్నీ కూడా లోలోపలే డ్యామేజ్ అవుతాయి. అందుకే, దీనిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదకరమైన గుండె సమస్యలు వచ్చి స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వరకూ సమస్యల్ని తీసుకొస్తాయి.

బీపీ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు

  • బీపీ పెరిగిన ఆ సమయంలో వచ్చిన లక్షణాలు
  • కళ్ళు తిరగడం
  • తూలిపోయినట్లుగా అవ్వడం
  • నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పినట్లుగా ఉంటుంది.
  • ఇదే స్టేజ్‌లో ఉన్న పేషెంట్ తన బీపీ లెవెల్స్‌ని చెక్ చేసుకుని హైబీపీ అంటే 210 ఉండగా వెంటనే బీపీ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు. దాంతోనే అసలు సమస్య మొదలైందని చెప్పారు.

బీపీ పెరిగినప్పుడు డాక్టర్‌తో సంప్రదించకుండా టాబ్లెట్లు వాడితే

బీపీ పెరిగిన పేషెంట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకుండా తనకి తానుగా మెడిసిన్ తీసుకోవడం వల్ల అది నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని డాక్టర్ చెబుతున్నారు. ఆ పేషెంట్ విషయంలోనూ అదే జరిగిందని, టాబ్లెట్స్ వేసుకున్న కాసేపటికే రెండు కళ్ళు కనిపించకుండా పోయాయని చెప్పారు. దీంతో భయపడి ఆ స్టేజ్‌లో హాస్పిటల్‌కి వచ్చారు. అదే టైమ్‌కి కిందపడిపోయి ఫిట్స్ కూడా వచ్చేసిందని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాంతోపాటు గురక కూడా స్టార్ట్ అయిందని చెబుతున్నారు.

ఎందుకు ఇలా జరిగింది

సాధారణంగా పేషెంట్‌కి ఇప్పుడు చెప్పిన లక్షణాల ప్రకారం అతను హాస్పిటల్‌కి వచ్చేసరికి ఎలాంటి స్పృహ లేదు. గురక కూడా వస్తుంది. దీన్ని బట్టి అతడు కోమాలోకి వెళ్లాడని డాక్టర్ చెప్పారు. దీనికి కారణం వారు ఆ సమయంలో ఏమీ మింగలేకపోవడం. నీరు, ఎంగిలి మింగలేరు. దీంతో అవన్నీ కూడా గొంతులోనే ఉండిపోయి గురక వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్‌కి ట్యూబ్ వేసి వెంటిలేటర్‌కు కనెక్ట్ చేయాల్సిందేనని డాక్టర్ చెబుతున్నారు.

స్కాన్‌లో తేలిన విషయమేమిటంటే

బీపీ పెరిగిన పేషెంట్‌ని స్కాన్ చేస్తే అందులో బ్రెయిన్ స్టెమ్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. ఇది బ్రెయిన్‌కి చాలా ముఖ్యమైన భాగం. ఈ బ్రెయిన్ స్టెమ్‌లోనే శ్వాసకు సంబంధించిన నరాలు, హార్ట్‌బీట్‌కు సంబంధించిన నరాలు మనం ప్రాణంతో ఉండేందుకు అవసరమైన ఎన్నో ముఖ్యమైన భాగాలు బ్రెయిన్ స్టెమ్‌లో ఉంటాయి.

ఎందుకిలా జరుగుతుందంటే

ఎప్పుడైతే బీపీ పెరిగిందో, అంటే కళ్లు తిరగడం, తూలడం జరిగిందో ఆ దశలోనే మెదడుకు రక్తసరఫరా తగ్గింది. అది తెలియకుండా బీపీని తగ్గించే మాత్ర వేయడం వల్ల పూర్తిగా రక్తసరఫరా తగ్గి మెల్లగా కోమాలోకి వెళ్లారు. ఆ సమయంలోనే రోగిని చూసేసరికి అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆ సమయంలో చికిత్స చేయడానికి కూడా అవకాశమే లేదు. దీంతో రోగిని కాపాడలేకపోయే అవకాశం ఉంది.

డాక్టర్ హెచ్చరిస్తున్నారేమిటంటే

బీపీ పెరిగిన వెంటనే చెక్ చేసుకుని వెంటనే డాక్టర్‌ని కలవాలి. అంతేకానీ, మనకి మనం ఎప్పుడూ కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవడం వంటి సొంత వైద్యాలు చేయకూడదు. కళ్ళు తిరగడం, తూలడం, బ్యాలెన్స్ తప్పడం వంటివి ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని ఆమె సూచించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • blood pressure
  • Blood Pressure Symptoms
  • BP Control
  • Controlling blood pressure
  • healthy tips
  • High Blood Pressure Symptoms
  • Life Style Tips
  • Manage Blood Pressure

Related News

Does eating boiled eggs prevent heart problems?

Eggs Benefits: ఉడికించిన కోడిగుడ్లు తింటే గుండె సమస్యలు రావా..?

దాదాపు అందరూ గుడ్లను ఇష్టపడతారు. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు, పూర్తి పోషకాహారం కూడా. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Egg Benefits) ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గుడ్లలో ఉండే ప్రోటీన్ కండరాలను నిర్మి

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd