Papaya Fruit Benefits : బొప్పాయి పండు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
బొప్పాయిని (Papaya Fruit) అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే పచ్చి బొప్పాయి దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయట.
- By Naresh Kumar Published Date - 02:55 PM, Sat - 16 December 23

Papaya Fruit Benefits : బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఈ బొప్పాయి పండ్లు (Papaya Fruit) మనకు మార్కెట్లో ఏడాది పొడవునా లభిస్తున్నాయి. బొప్పాయిని పోషకాల నిధి అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, ఎటమిన్ సి ఇలా ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. బొప్పాయిలో తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉండడం ఒక విశేషం. కాగా ఇందులో విటమిన్లతో పాటు ఐరన్, ఫాస్పరస్, మాంగనీస్, కాలుష్యం, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. సహజంగా పండిన బొప్పాయిని (Papaya Fruit) అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే పచ్చి బొప్పాయి దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయట. మరి వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ యాంటీ ఆక్సిడెంట్ల వలన బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది. అలాగే పచ్చి బొప్పాయి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. జీర్ణ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. కీళ్ల సమస్యలకు కూడా చెక్ పెట్టే ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ పండు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయి జీర్ణ క్రియకు తోడ్పాటు ఇస్తుంది. ఈ బొప్పాయి ఆహారాన్ని సాధారణంగా జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. దీనిలో పాపై అనే డైజేస్టివ్ ఎంజాయ్ కలిగి ఉంటుంది. దీనిలో కడుపులో ఉన్న గ్యాస్ ని జ్యూస్ లేకపోయినా దాని స్థానాన్ని ఫీల్ చేస్తుంది.
అదే విధంగా పేగులలో చికాకు కడుపులో ఇబ్బందికర పరిస్థితిని అధిగమించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి పచ్చి బొప్పాయిని చాలామంది వాడుతూ ఉంటారు. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బొప్పాయి పోషక ఉపయోగాలు మహిళలకు చాలా బాగా ఉపయోగపడతాయి. బొప్పాయి ఆకులు పీరియడ్స్ నొప్పికి నివారణగా ఉపయోగపడతాయి. మీరు బొప్పాయి ఆకు, చింతపండు, ఉప్పును నీటితో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఆర్థరైటిస్ ఉన్న రోగులకి కూడా చాలా ప్రయోజనం ఉంటుంది యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు పచ్చి బొప్పాయిలో ఎక్కువగా ఉంటాయి. ధూమపానం చేసేవారిలో ఉపిరితిత్తుల వాపును తగ్గించే విటమిన్ కూడా దీంట్లో ఉంటుంది. తాజా ఆకుపచ్చ బొప్పాయి రసం కూడా ఎర్రబడిన టాన్సిల్స్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాగా బొప్పాయి కేవలం ఆరోగ్యానికీ మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.
Also Read: Egg : వైట్ ఎగ్, బ్రౌన్ ఎగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?