Egg : వైట్ ఎగ్, బ్రౌన్ ఎగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?
అంతా బాగానే ఉంది కానీ మార్కెట్లో మనకు ఎక్కువగా బ్రౌన్ కలర్ కోడిగుడ్లు అలాగే వైట్ కలర్ కోడిగుడ్లు (Egg) ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
- By Naresh Kumar Published Date - 02:30 PM, Sat - 16 December 23

Which is better White Egg, Brown Egg? : ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ప్రతిరోజూ ఒక కోడిగుడ్డును (Egg) తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. తరచుగా కోడిగుడ్డును తింటూ ఉండటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే అంతా బాగానే ఉంది కానీ మార్కెట్లో మనకు ఎక్కువగా బ్రౌన్ కలర్ కోడిగుడ్లు అలాగే వైట్ కలర్ కోడిగుడ్లు (Egg) ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని చూసిన ప్రతిసారి ఈ రెండింట్లో ఏది మంచిది దేనిని తినడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. మరి బ్రౌన్ ఎగ్ (Brown Egg), వైట్ ఎగ్ (White Egg) ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re Now on WhatsApp. Click to Join.
గుడ్డు కలర్ ఎక్కువగా కోడి జాతి కోడి ఉత్పత్తి చేసి పిగ్మెంట్ లపై ఆధారపడి O’clock. ఆహారం ఒత్తిడి లెవెల్ పర్యావరణం లాంటి ఇతర అంశాలు కూడా గుడ్డు రంగుని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ రెండు గుడ్ల మధ్య పోషక వ్యత్యాసం ఉండదు. దీనికి బదులుగా కోడి ఆహారం పర్యావరణ కారకాలు గుడ్డు పోసినను ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఒక పెద్ద గుడ్డులో ఆరు పాయింట్ మూడు గ్రాముల ప్రోటీన్, 4.7 గ్రాముల కొవ్వు జీరో పాయింట్ త్రీ గ్రాముల కార్బోహైడ్రేట్స్ అదనంగాఒక గుడ్డులో 0.8, 147 ఎంజి కొలిన్, 0.4 ఎంసీజీ విటమిన్, విటమిన్ ఏ ,విటమిన్ బి12, 15.4 ఎంజి సెలీనియం, 23.ఎం.జి పొలిట్ దీనిలో ఉంటాయి.
కొంతమంది ఒక నిర్దిష్ట రంగు గుడ్లు ఇతర వాటికంటే ఆరోగ్యానికి మంచిదని అలాగే రుచిగా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అయితే నిజానికి అన్ని రకాల గుడ్లు పోషకపరంగా సమానంగానే ఉంటాయి. కావున రెండు గుడ్లు మీకు ఆరోగ్యానికి మంచిదే. అలాగే బ్రౌన్ ఎగ్ వైట్ ఎగ్ ఈ రెండు రకాల ఎగ్స్ పై ఉన్న కలర్ వేరు కానీ లోపల ఉన్న పోషకాలు మాత్రం ఒక్కటే. కాబట్టి ఈ రెండింటిలో ఏది మంచిది అన్న సందేహం మీకు అక్కర్లేదు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.
Also Read: Lakshmi Blessings : లక్ష్మీ అనుగ్రహం పొందాలనుకుంటున్నారా.. అయితే వెంటనే ఈ అలవాట్లను మానుకోండి?