Women Bodybuilders: హనుమంతుడి ముందు ఇవేం పనులు.. మహిళల దుస్తులపై రాజకీయం..!
బీజేపీ చేష్టలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తీవ్రంగా మడిపడుతోంది. హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేసి, ఆ విగ్రహ సమక్షంలోనే మహిళలకు బాడీ బిల్డింగ్ (Women Bodybuilding) పోటీలు బీజేపీ ఏర్పాటు చేయించింది.
- By Gopichand Published Date - 01:04 PM, Tue - 7 March 23

బీజేపీ చేష్టలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తీవ్రంగా మడిపడుతోంది. హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేసి, ఆ విగ్రహ సమక్షంలోనే మహిళలకు బాడీ బిల్డింగ్ (Women Bodybuilding) పోటీలు బీజేపీ ఏర్పాటు చేయించింది. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో నిర్వహించిన బాడీ బిల్డింగ్‌లో పాల్గొన్న మహిళల దుస్తులపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆదివారం రత్లామ్ లో జూనియర్ మిస్టర్ ఇండియా-2023 పోటీలు నిర్వహించారు. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 350 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా బాడీబిల్డర్లు దుస్తులు, చెప్పులు ధరించి ప్రదర్శించారు. పోటీ జరుగుతున్న చోట వేదికపై హనుమాన్ విగ్రహం కూడా ఉంది. అయితే అందులో వాళ్ల వస్త్రధారణ బికినీలతో ఉండడంతో దేవుడి విగ్రహం ముందు, అదీ అసభ్యతను ప్రొత్సహించడమేంటని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు ముఖాముఖి తలపడ్డారు. రత్లామ్ లో జరిగిన ఈ కార్యక్రమం వల్ల రాష్ట్ర అధినేత సిగ్గుతో తలవంచుకున్నారని, ఆ కార్యక్రమంలో అసభ్యకరంగా ప్రవర్తించడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత పరాస్ సక్లేచా అన్నారు. కాంగ్రెస్ చేసిన ప్రకటనలకు బిజెపి కూడా సమాధానం ఇచ్చింది.
Also Read: Conrad Sangma: మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ హితేష్ వాజ్‌పేయి హావభావాలపై కాంగ్రెస్ నాయకుల మనస్తత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్ వాళ్లు మహిళలు కుస్తీలు ఆడడాన్ని చూడలేరని, జిమ్నాస్టిక్స్ చేసే మహిళలను చూడలేరని, ఈత కొడుతున్న ఆడవాళ్లను చూడలేరని, ఇందులో వాళ్లలోని దెయ్యం మేల్కొంటుందని అన్నారు. కుస్తీ, జిమ్నాస్టిక్స్, ఈతలు.. ఇలా ఏ క్రీడల కేటగిరీలోనూ మహిళలు రాణించాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదు. మైదానంలోని మహిళలను పాడు కళ్లతోనే చూస్తారు వాళ్లు. అందుకు వాళ్లకు సిగ్గుండాలి అని విమర్శించారు.
हिंदू धर्म और बाल ब्रह्मचारी भगवान बजरंग बली का ऐसा अपमान इतिहास में कभी नहीं हुआ जैसा बीजेपी कर रही है। हनुमान जी की प्रतिमा के सामने नग्नता।
ये तो उन राक्षसों की तरह हो गए हैं जो भगवान से वर पाकर भगवान का ही द्रोह करते हैं।
भाजपा हिंदू धर्म की दुश्मन है। pic.twitter.com/Gaj68RBvF6
— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) March 6, 2023
ఇక ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ వ్యక్తిగత మీడియా సలహాదారు పీయూష్ బాబెలే స్పందించారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమాన్ భగవాన్ సమక్షంలో ఇలాంటి అసభ్యతను ప్రదర్శించడం దారుణమన్నారు. భగవంతుడ్ని అగౌరవపరిచి.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మార్చి 4, 5వ తేదీల్లో రత్లాంలో మిస్టర్ జూనియర్ బాడీబిల్డింగ్ పోటీలు జరిగాయి. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు వార్తల్లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related News

Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..
గతేడాది మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో (Kuno National Park) నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ వదిలిపెట్టారు. ప్రధాని మోదీ తన పుట్టినరోజు సెప్టెంబర్ 17న ఈ చిరుతలను విడుదల చేశారు. ఇటీవల, ఈ ఆడ చిరుతలలో ఒకటి మరణించింది. అయితే, ఇప్పుడు కునో నుండి ఒక శుభవార్త వచ్చింది. సెప్టెంబర్ 17న, ప్రధాని మోదీ విడుదల చేసిన 3 చిరుతల్లో ఒక ఆడ చిరుత 4 పిల్లలకు జన్మనిచ్చింది. చిరు