HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >What Is Caste Census Why Is It Done Who Benefits When Was It Done In The Past

Caste Census : కుల గణన అంటే ఏమిటి ? ఎవరికి లాభం ?

బ్రిటీషర్ల పాలనా కాలంలోనే మన దేశంలో కులగణన(Caste Census) నిర్వహించారు.

  • By Pasha Published Date - 10:15 AM, Thu - 1 May 25
  • daily-hunt
Caste Census

Caste Census : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కులగణన జరగబోతోంది. ఇందుకు కేంద్రంలోని మోడీ సర్కారు బుధవారం మధ్యాహ్నం పచ్చజెండా ఊపింది. కులగణనతో ముడిపడిన చారిత్రక, సామాజిక అంశాల గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :BJP Big Plan: గోదావరి జిల్లాలపై బీజేపీ గురి.. ఇద్దరు ఎంపీలతో బిగ్ స్కెచ్

కులగణన అంటే ఏమిటి ? 

మనదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని సామాజిక వర్గాల్లోనూ  కులాలు ఉన్నాయి. ఆయా వర్గాల వారు సదరు కులాల పేరుతో క్యాస్ట్ సర్టిఫికెట్లు పొందుతుంటారు. ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ? వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి ? విద్యాపరంగా వారి పరిస్థితి ఎలా ఉంది ? అనే వివరాలను దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో భాగంగా సేకరించనున్నారు. ప్రభుత్వ ఉపాధి, సంక్షేమ పథకాల అందుబాటు వంటి అంశాల్లో వివిధ కులాల వాటాపై క్లారిటీకి రావడానికి కులగణన దోహదం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ సమాచారం ప్రామాణికంగా మారుతుంది. దీని ఆధారంగానే ఆయా వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి ఏటా బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తారు. ప్రభుత్వ ప్రణాళికలు కూడా ఈ కులాల కూర్పుకు అనుగుణంగానే ఉండనుంది.

గతంలోనూ కులగణనలు.. 

బ్రిటీషర్ల పాలనా కాలంలోనే మన దేశంలో కులగణన(Caste Census) నిర్వహించారు. 1881 నుంచి 1931 సంవత్సరం వరకు మనదేశంలో బ్రిటీషర్లు కులగణన చేయించారు. 1931కి ముందు నిర్వహించిన ప్రతి జనాభా గణనలో అన్ని కులాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కులగణన ఆగిపోయింది.తొలిసారిగా 1951లో మనదేశంలో జనగణన చేయగా.. అందులో  కుల గణనను చేర్చలేదు.  అయితే 1961లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనాభా లెక్కల్లో రాష్ట్రాలు సొంతంగా ఓబీసీల లెక్కలను చేర్చుకోవచ్చని సూచించింది.

ఇతర కులాల సమాచారం లేకుండానే.. 

1951 నుంచి 2011 వరకు భారతదేశంలోని ప్రతి జనాభా గణన షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) డేటాను సేకరించి ప్రచురించింది. కానీ ఇతర కుల సమూహాల డేటాను సేకరించలేదు.  భారత ప్రభుత్వం పౌరులను సామాజిక, విద్యా ప్రమాణాల ఆధారంగా నాలుగు విస్తృత సమూహాలుగా వర్గీకరించింది. అవి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ. 1971 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా మన దేశ మొత్తం జనాభాలో 21.54 శాతంగా ఉంది.  2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 25.26 శాతానికి పెరిగింది.2011లో నాటి యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల గణన (SECC)ను నిర్వహించింది. అయితే పలు కారణాల వల్ల ఆ సర్వే వివరాలను అధికారికంగా విడుదల చేయలేదు. ఎట్టకేలకు 60 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కులగణన చేయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే జనాభా గణనలో భాగంగా కుల గణనను కూడా చేపడతామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం ప్రకటించారు.

ఎన్డీయే ప్రభుత్వం నో చెప్పడంతో ఈ  రాష్ట్రాల్లో..

ఎన్డీయే ప్రభుత్వం కుల గణనను తిరస్కరిస్తూ వస్తుండటంతో.. తొలిసారిగా బిహార్‌‌లో కులగణన నిర్వహించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో కుల గణన జరిగింది. 2023లో బిహార్‌ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో ఓబీసీలు, ఈబీసీలు 63శాతం మంది ఉన్నట్లు తేలింది. 2024లో ఆంధ్రప్రదేశ్‌ కుల గణనను చేపట్టింది.  2024 నవంబరులో తెలంగాణలో కుల గణన జరిగింది.   2021లో కుల గణన చేపట్టాలని జార్ఖండ్‌ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఒడిశా, మహారాష్ట్రల్లోనూ కుల గణనపై తీర్మానాలు జరిగాయి.

Also Read :ATM Charges Hike: నేటి నుంచే ఏటీఎం ఛార్జీల పెంపు.. ఎంత ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • caste census
  • Caste Census Facts
  • congress
  • india
  • Indian Casts
  • pm modi

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Bhatti Vikramarka

    Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

  • Ex Soldier India

    Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

  • Folk Singer Maithili Thakur

    Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

  • PM Modi

    PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd