HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Varun Gandhi Welcome To Join Us Congress Offer After Bjp Snub

Varun Gandhi : వరుణ్ గాంధీకి కాంగ్రెస్‌ ఆఫర్.. పార్టీలో చేరే ఛాన్స్ ?

Varun Gandhi : ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లోక్‌సభ టికెట్‌ను వరుణ్ గాంధీకి ఇచ్చేందుకు బీజేపీ నో చెప్పింది.

  • Author : Pasha Date : 26-03-2024 - 2:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi Varun Gandhi
Rahul Gandhi Varun Gandhi

Varun Gandhi : ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లోక్‌సభ టికెట్‌ను వరుణ్ గాంధీకి ఇచ్చేందుకు బీజేపీ నో చెప్పింది. ఈసారి జితిన్‌ ప్రసాదకు పిలిభిత్ టికెట్‌ను కేటాయించింది. దీంతో వరుణ్ గాంధీ రాజకీయ భవితవ్యం డైలమాలో పడింది. ఈ పరిస్థితుల్లో ఆయన ఎదుటకు రెండు ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ టికెట్ మాట్లాడుతూ..  వరుణ్ గాంధీకి టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పిలిభిత్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే గడువు రేపటితో ముగియనుంది. ఈతరుణంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత  అధిర్ రంజన్‌ చౌదరి కీలక ప్రకటన చేశారు. ‘‘వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరితే మేం సంతోషిస్తాం. వరుణ్‌ విద్యావంతుడు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. కేవలం గాంధీ కుటుంబానికి సంబంధం ఉందన్న కారణంతోనే బీజేపీ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఆయనను మేం సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. దీంతో ఇవాళ రాత్రికల్లా వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

గత కొంతకాలంగా బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్రంలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై వరుణ్‌ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. అమేథీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రి లైసెన్సును సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు రద్దు చేసినప్పటి నుంచి ఈ వ్యవహారం ముదురుతోంది. తమ ఆస్పత్రి పేరులో ‘గాంధీ’ అనే పదం ఉండబట్టే .. యోగి సర్కారు లైసెన్సును రద్దు చేసిందని అప్పట్లో వరుణ్ గాంధీ మండిపడ్డారు. ఈ పరిణామం చోటుచేసుకున్న కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కేదార్‌నాథ్‌లో వరుణ్ గాంధీ(Varun Gandhi) కలుసుకున్నారు. కాగా.. వరుణ్‌ తల్లి మేనకా గాంధీకి మాత్రం లోక్‌సభ టికెట్ కేటాయించింది. యూపీలోని సుల్తాన్‌పుర్‌ నుంచి ఆమెను బరిలోకి దింపింది.

Also Read : 733 Jobs : రైల్వేలో 733 జాబ్స్.. ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ సహా ఎన్నో పోస్టులు

జితిన్ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ ఇదీ.. 

ప్రస్తుతం బీజేపీ తరఫున పిలిభిత్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జితిన్ ప్రసాద్ ఒకప్పుడు కాంగ్రెస్‌లోనే ఉండేవారు.  2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున షాజహాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. 2009 ఎన్నికల్లో ధౌరహర స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా  శాఖ, పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రిగా జితిన్‌ వ్యవహరించారు.  రెండు సంవత్సరాల క్రితమే జితిన్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Congress offer
  • elections 2024
  • Varun Gandhi

Related News

Tvk Bjp

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచే ఛాన్స్ ఉందా ? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏమంటుంది ?

తమిళనాడులో ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే అధికార ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సర్వే అంచనా వేసింది. మొత్తం 39 స్థానాలకు గాను ఏకంగా 38 స్థానాలను ఈ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. డీఎంకే మరియు కాంగ్రెస్ పక్షాలు తమ పట్టును ఏమాత్రం కోల్పోకుండా విపక్షాలకు నామమాత్రపు అవకాశాన్ని

  • Survey

    ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • Budget 2026 Updates

    కేంద్ర బడ్జెట్ పై బిజెపి కీలక నిర్ణయం

  • Ajit Pawar Plane Crash

    అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

  • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd