733 Jobs : రైల్వేలో 733 జాబ్స్.. ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ సహా ఎన్నో పోస్టులు
733 Jobs : రైల్వే ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎదురు చూస్తున్నారా ? ఇది మంచి అవకాశం.
- Author : Pasha
Date : 26-03-2024 - 2:22 IST
Published By : Hashtagu Telugu Desk
733 Jobs : రైల్వే ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎదురు చూస్తున్నారా ? ఇది మంచి అవకాశం. రైల్వేలో 733 అప్రెంటిస్పోస్టుల భర్తీకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నియామకం ఒప్పంద ప్రాతిపదికన జరగనుంది. అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగణంగా టెన్త్, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. అత్యధికంగా ఫిట్టర్ పోస్టులు 187, ఎలక్ట్రీషియన్ పోస్టులు 137, కోపా (COPA) పోస్టులు 100, వైర్‌మెన్ పోస్టులు 80, పెయింటర్ పోస్టులు 42, కార్పెంటర్ పోస్టులు 38 ఉన్నాయి. వీటితో పాటు డ్రాఫ్ట్‌మెన్ (సివిల్) – 10, ఎలక్ట్రో మెకానిక్ – 5, మెషినిస్ట్ – 4, ప్లంబర్ – 25, మెకానిక్ (RAC) – 15, ఎస్ఎండబ్ల్యూ – 4, స్టెనో (ఇంగ్లీష్) – 27, స్టెనో (హిందీ) – 19, డీజిల్ మెకానిక్ – 12, టర్నర్ – 4, వెల్డర్ – 18, కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్ – 4, డిజిటల్ ఫొటోగ్రాఫర్ – 2 పోస్టులు(733 Jobs) ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
పై ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.టెన్త్, ఇంటర్, ఐటీఐల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాదిపాటు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు. అభ్యర్థులు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ https://www.apprentice shipindia.gov.in ద్వారా అప్లికేషన్ ఫామ్‌ను సమర్పించాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ ఏప్రిల్ 12.
Also Read :Adani Group : రూ.3,350 కోట్లతో అది కొనేసిన అదానీ
హైదరాబాద్‌లో 7 ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టులు
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో 7 ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 13లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. వయసు 27 సంవత్సరాలకు మించకూడదు. నెలవారీ పే స్కేల్ రూ.40,000 నుంచి రూ.1.40 లక్షల దాకా ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.