Reasi Terror Attack: పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం తప్పదా..?
మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ భయాందోళనలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని
- By Praveen Aluthuru Published Date - 05:10 PM, Mon - 10 June 24

Reasi Terror Attack: జమ్మూకశ్మీర్‌లో రియాసి ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే షాకింగ్ కామెంట్స్ చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతమైందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ భయాందోళనలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని… పీఓకే ద్వారా చాలా మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ ని కచ్చితంగా భారత్ కు అప్పగించాల్సి ఉంటుందని అథవాలే అన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని రియాసీలో శివఖోడి ధామ్‌ను సందర్శించి తిరిగి వస్తున్న భక్తుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఆ తర్వాత బస్సు అదుపు తప్పి నేరుగా లోతైన గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 41 మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేస్తారు.
Also Read: Kesineni Nani : కేశినేని నానికి కిస్మత్ కలిసి రాలే..!