HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄India
  • ⁄Training Plane Crashes In Madhya Pradeshs Balaghat Both Pilots Killed

Training Plane Crash: విషాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలెట్లు మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. నక్సలైట్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని కొండ ప్రాంతంలో శనివారం శిక్షణ విమానం (Training Plane Crash) కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు.

  • By Gopichand Published Date - 07:51 AM, Sun - 19 March 23
Training Plane Crash: విషాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలెట్లు మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. నక్సలైట్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని కొండ ప్రాంతంలో శనివారం శిక్షణ విమానం (Training Plane Crash) కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు. అమేథీలోని ఫుర్సత్‌గంజ్‌లో ఉన్న ఇందిరాగాంధీ నేషనల్ ఫ్లయింగ్ అకాడమీకి చెందిన ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ డైమండ్-40 శనివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పైలట్‌, ట్రైనీ పైలట్‌ మృతి చెందారు. ఇందిరా గాంధీ నేషనల్ ఫ్లైట్ అకాడమీకి చెందిన ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ డైమండ్-40 వారం క్రితం మహారాష్ట్రలోని గోండియాలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ రెండవ శాఖ అయిన విర్సీ విమానాశ్రయానికి వెళ్లింది.

కెప్టెన్ మోహిత్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్ నివాసి), ట్రైనీ పైలట్ వి. మహేశ్వరి (గుజరాత్ నివాసి) విమానంతో వెళ్లారు. ఇద్దరూ శనివారం సాధారణ శిక్షణ విమానంలో ఉన్నారు. విమానం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని కిరణ్‌పూర్ అటవీప్రాంతం కొండల వద్దకు రాగానే శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌, ట్రైనీ పైలట్‌ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇన్‌స్టిట్యూట్ మీడియా ఇన్‌ఛార్జ్ ఆర్‌కే ద్వివేది ప్రమాద విషయాన్ని ధృవీకరించారు. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన దర్యాప్తు బృందం ఆదివారం బాలాఘాట్‌కు వెళ్తుందని ద్వివేది చెప్పారు. దర్యాప్తు బృందంలో ఉన్న నిపుణులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తారు.

Also Read: Earthquake In Ecuador: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 13 మంది మృతి

A flying instructor & a trainee female co-pilot of Indira Gandhi Rashtriya Udan Academy IGRUA #Gondia were killed after an aircraft they were flying crashed in the dense forest of village Bhakkutola, Kirnapur near #Balaghat in Madhya Pradesh. Cause of the #crash are yet unknown. pic.twitter.com/BaOvEzlXQq

— Praveen Mudholkar (@JournoMudholkar) March 18, 2023

బాలాఘాట్ సరిహద్దులోని గోండియా జిల్లాలోని బిర్సీ ఎయిర్ స్ట్రిప్ నుంచి మధ్యాహ్నం 3.06 గంటలకు శిక్షణ విమానం బయలుదేరిందని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ తెలిపారు. అయితే మధ్యాహ్నం 3.11 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నారు.

Telegram Channel

Tags  

  • Aircraft Crash
  • Madhya Pradesh
  • plane crash
  • Training Plane Crash
  • Two Pilots Dead
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Glider Plane Crash: ఇంటిపై కూలిన గ్లైడర్.. పైలట్‌తో సహా ఇద్దరికి తీవ్ర గాయాలు

Glider Plane Crash: ఇంటిపై కూలిన గ్లైడర్.. పైలట్‌తో సహా ఇద్దరికి తీవ్ర గాయాలు

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జాయ్‌రైడ్ గ్లైడర్ (Glider Plane) టేకాఫ్ అయిన వెంటనే నివాస భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు 14 ఏళ్ల ప్రయాణికుడు గాయపడ్డారు.

  • Madhya Pradesh: 60 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు మృతి

    Madhya Pradesh: 60 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు మృతి

  • NIA raids : మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో NIA సోదాలు

    NIA raids : మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో NIA సోదాలు

  • Aircrash: విమానంలో మంటలు… ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో!

    Aircrash: విమానంలో మంటలు… ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో!

  • Two Planes Collide: ఫ్లోరిడాలో రెండు విమానాలు ఢీ.. నలుగురు మృతి

    Two Planes Collide: ఫ్లోరిడాలో రెండు విమానాలు ఢీ.. నలుగురు మృతి

Latest News

  • Hero Father Passed Away: స్టార్ హీరో తండ్రి కన్నుమూత

  • Gold Price Today: మహిళలకు కన్నీళ్లు పెట్టిస్తున్న బంగారం ధరలు..!

  • Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!

  • Vishnu Matsya Avatara: మత్స్య జయంతి, విష్ణువు మత్స్యావతార విశేషాలు

  • Putin Arrest Warrant: పుతిన్‌ను అరెస్ట్ చేస్తే యుద్ధం తప్పదు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా మాజీ అధ్యక్షుడు

Trending

    • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: