TMC : ఈ ఎన్నికల ఫలితాలే లోక్‌సభ ఎన్నికలకు బూస్ట్ – టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ
వెస్ట్ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తమపార్టీకి ఓటు వేసిన ప్రజలకు ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ కృతజ్ఞతలు
- Author : Prasad
Date : 12-07-2023 - 8:46 IST
Published By : Hashtagu Telugu Desk
వెస్ట్ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తమపార్టీకి ఓటు వేసిన ప్రజలకు ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలే తమకు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బూస్టింగ్ అన్నారు. బిజెపికి చెందిన ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారిని ఉద్దేశించి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, మమతకు ఓటు లేదు అనే ప్రచారం నుంచి ఇప్పుడు మమతకు ఓటు వేయండి”గా మారిందని అన్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సువేంధు అధికారి ‘మమతకు ఓటు వేయవద్దు’ నినాదాన్ని లేవనెత్తారని ఆయన ప్రస్తావించారు.కానీ ప్రజలు టీఎంసీకి ఓటు వేసి గెలిపించారని తెలిపారు. అయితే ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. జూలై 8న బ్యాలెట్ పేపర్ల ద్వారా పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. గ్రామపంచాయతీ స్థాయిలో టీఎంసీ ఇప్పటి వరకు 18,606 స్థానాల్లో విజయం సాధించి 8768 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష బీజేపీ 4449 స్థానాల్లో విజయం సాధించి 2566 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఐ(ఎం) 1,424 స్థానాల్లో గెలిచి 972స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ 1,073 స్థానాల్లో గెలిచి 738 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.