విదేశాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందిః జైశంకర్
- Author : Latha Suma
Date : 16-03-2024 - 1:21 IST
Published By : Hashtagu Telugu Desk
Jaishankar: భారత్(India)పై ప్రపంచ దేశాల(world countries) అభిప్రాయంలో మార్పులు వస్తున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్(external affairs minister s. jaishankar) అన్నారు. తన సమస్యలను తనే పరిష్కరించుకోగల దేశంగా భారత్‌పై అభిప్రాయం ఉందని అన్నారు. ఈటీ అవార్డ్స్ 2023(ET Awards 2023)కార్యక్రమంలో తాజాగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ‘సంవత్సరం మేటి సంస్కరణకర్త’ అవార్డును అందించారు. అనంతరం భారత్‌పై ప్రపంచదేశాల ధోరణిలో వస్తున్న మార్పును ఆయన ప్రస్తావించారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘భారత్ తన సమస్యలకు తగిన పరిష్కారాలను తానే వెతుక్కోగల దేశంగా ప్రపంచం పరిగణిస్తోంది. తన అభిప్రాయాలను నిర్భీతిగా వ్యక్తం చేస్తూ, దేశ ప్రజల ప్రయోజనాలు, ఇంధన భద్రత, జాతీయ భద్రతలను పరిరక్షించగల దేశంగా అభిప్రాయం ఉంది. కాబట్టి, నేటి భారత్ భిన్నమైనది. భారత్‌కు విదేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నేనెంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను’’ అని ఆయన అన్నారు.
read also: Kavitha : అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తా: కవిత
గత కొన్నేళ్లల్లో భారత్ ప్రపంచంపై బలమైన ముద్ర వేసిందన్నారు. కొవిడ్ సంక్షోభం విసిరిన సవాళ్లను దీటుగా ఎదుర్కొందన్నారు. వ్యాక్సిన్ మైత్రీ పేరిట ప్రపంచ దేశాలకు టీకాలను భారత్ అందించిందని గుర్తు చేశారు. ఆపరేషన్ గంగా, కావేరి, అజేయ్ వంటి మిషన్లతో విదేశాల్లోని భారతీయులను ఆదుకోవడంతో పాటూ వందేభారత్ మిషన్ ద్వారా గొప్ప విజయం అందుకుందన్నారు. భారత్ సాధిస్తున్న అభివృద్ధి ప్రపంచం దృష్టిలో పడిందని అన్నారు. విదేశాల్లోని అనేక ప్రాజెక్టులు, పెరిగిన ఎగుమతులు భారత్ సాధించిన విజయాలని చెప్పారు.