HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >The Path Is Clear For Vijay

Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

  • Author : Vamsi Chowdary Korata Date : 08-05-2026 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Thalapathy Vijay
Cm Thalapathy Vijay

తమిళనాడులో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే పార్టీకి.. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా.. తాజాగా చిన్న చిన్న పార్టీల మద్దతును కూడబెట్టడంలో విజయ్ సఫలీకృతం అయినట్లు తెలుస్తోంది. సీపీఐ, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక డీఎండీకేతో టీవీకే నేతల సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో టీవీకే పార్టీ మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనుంది.

ఈనెల 4వ తేదీన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. తమిళనాడులో హంగ్ ఏర్పడటంతో తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకి.. ఇప్పటివరకు ఇతర పార్టీల మద్దతు లభించకపోవడంతో.. ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో రకరకాల ఊహాగానాలు, కొత్త పొత్తులకు సంబంధించిన చర్చలు, పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే రెండు సార్లు గవర్నర్‌ను కలిసి తమను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని విజయ్ కోరినా.. మెజార్టీ 119 మంది బలం చూపించాలని పేర్కొనడంతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా తమిళ హైడ్రామాకు చెక్ పడినట్లు వార్తలు వస్తున్నాయి. టీవీకే పార్టీకి మద్దతు తెలిపేందుకు వామపక్షాలు, వీసీకే పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఒక సీటు ఉన్న డీఎండీకే పార్టీ మద్దతు కోసం కూడా టీవీకే నేతలు ప్రయత్నాలు చేస్తూ.. చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకు లభించడంతో.. ఇవన్నీ కలిపితే.. టీవీకే పార్టీ మెజార్టీ మార్కును దాటుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సాయంత్రమే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి.. మెజార్టీ గురించి వివరించేందుకు టీవీకే పార్టీ అపాయింట్‌మెంట్ కోరింది. సాయంత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకే నేతలు.. తమ పార్టీతోపాటు, వారికి మద్దతుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్ అనుమతిస్తే.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ కానుంది. అదే జరిగితే.. తమిళనాట నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cm Thalapathy Vijay
  • Left Parties Support
  • Tamil Nadu Government Formation
  • tamil nadu politics
  • Tamilaga Vetri Kazhagam
  • tvk
  • Vijay thalapathy

Related News

DMK Bids Farewell to Alliance

DMK: పొత్తుకు గుడ్ బై చెప్పిన డీఎంకే

తమిళనాడు రాజకీయాల్లో ఒక భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే – కాంగ్రెస్ మధ్య దశాబ్దాల కాలం నాటి పొత్తు తెగిపోయేలా చేశాయి. టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే, చివరకు కాంగ్రెస్‌తో బంధాన్ని అధికారికంగా తెంచుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ల

  • Cm Thalapathy Vijay

    CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

  • The Governor invited Vijay to form the government

    Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

  • Massive Shock for Thalapathy Vijay...

    Tamil Nadu politics: దళపతి విజయ్‌కు భారీ షాక్..

  • Vijay TVK

    TVK విజయ్ ఆసక్తికర ట్వీట్

Latest News

  • Shani Jayanti 2026: శని జయంతి నాడు మీ రాశిని బట్టి ఇవి దానం చేయండి.. శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుందట..!

  • Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

  • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

  • Hantavirus: హంటా వైరస్ లక్షణాలు ఏంటి? కరోనా కంటే ప్రమాదమా?

  • Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

Trending News

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd