Male Suicides : పురుషుల సూసైడ్స్ కలకలం.. ప్రధాన కారణాలు ఇవేనంట !
ఎన్‌సీఆర్‌బీ ప్రకారం.. ప్రతి 1 లక్ష మంది పురుషుల్లో 14.2 మంది సూసైడ్స్(Male Suicides) చేసుకుంటున్నారు.
- By Pasha Published Date - 10:31 AM, Sun - 5 January 25

Male Suicides : మనదేశంలో పురుషుల ఆత్మహత్యలు కలవరం రేకెత్తిస్తున్నాయి. ఏటా దాదాపు లక్ష మందికిపైగా పురుషులు సూసైడ్స్ చేసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. భరణం కోసం భార్య పెట్టిన డిమాండ్లను తట్టుకోలేక ఇటీవలే బెంగళూరులో టెకీ అతుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్న అంశం ఎంతైతే నిజమో.. పురుషులు సైతం మహిళల వేధింపుల బారినపడుతున్నారు అనేది అంతే నిజమని సామాజిక పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ పురుషులు ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు ? కారణాలు ఏమిటి ? ఇప్పుడు చూద్దాం..
Also Read :Weekly Horoscope : ఆ రాశుల వాళ్లు ఆర్థిక వ్యవహారాల్లో బీ అలర్ట్.. జనవరి 5 నుంచి జనవరి 11 వరకు వారఫలాలు
ఇవీ గణాంకాలు, కారణాలు..
- కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం.. 2015 నుంచి 2022 మధ్యకాలంలో (ఎనిమిది ఏళ్లలో) మనదేశంలో ప్రతి సంవత్సరం సగటున 1.01 లక్షల మంది పురుషులు సూసైడ్స్ చేసుకున్నారు.
- ఎన్‌సీఆర్‌బీ ప్రకారం.. ప్రతి 1 లక్ష మంది పురుషుల్లో 14.2 మంది సూసైడ్స్(Male Suicides) చేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో ప్రతీ 1 లక్ష మంది మహిళల్లో 6.6 మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. అంటే సూసైడ్స్ రేట్ అనేది పురుషుల్లోనే ఎక్కువగా ఉంది.
- పురుషులు, మహిళల్లో ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా కుటుంబ సమస్యలే నిలుస్తున్నాయి. దేశంలో జరుగుతున్న దాదాపు 23.06 శాతం ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఇదే అని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది.
- పురుషులు, మహిళల్లో ఆత్మహత్యలకు మరో ప్రధాన కారణం ఆరోగ్య సమస్యలు. 23.05 శాతం ఆత్మహత్యలు ఈ కారణం వల్లే జరుగుతున్నాయట.
- పురుషులకు సంబంధించిన 3.28 శాతం సూసైడ్స్‌కు కారణాలు వివాహ సంబంధమైనవే. మహిళలకు సంబంధించిన 9.66 శాతం సూసైడ్స్‌కు కారణాలు పెళ్లితో ముడిపడినవే.
- గత ఎనిమిది ఏళ్లలో మన దేశంలో వివాహ సంబంధ కారణాలతో 26,588 మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో పెళ్లి జరగడం లేదనే కారణంతో 10,119 మంది సూసైడ్ చేసుకోవడం గమనార్హం. ఇక ఇదే కారణంతో 33,480 మంది మహిళలు సూసైడ్స్ చేసుకున్నారు. వీరిలో 14,250 మంది మహిళల ఆత్మహత్యలకు కారణం వరకట్నంతో ముడిపడినదే.
- 2015 నుంచి 2022 మధ్యకాలంలో మన దేశంలో సూసైడ్స్ చేసుకున్న 8.09 లక్షల మంది పురుషుల్లో రైతులు, వ్యవసాయ కూలీలు 10 శాతం(81వేలు) మంది ఉన్నారు. వీరి సూసైడ్స్‌కు ప్రధాన కారణాలు.. పంట నష్టం, ఆర్థిక నష్టాలు, అప్పుల భారం, ఇతర సామాజిక కారణాలు.