Weekly Horoscope : ఆ రాశుల వాళ్లు ఆర్థిక వ్యవహారాల్లో బీ అలర్ట్.. జనవరి 5 నుంచి జనవరి 11 వరకు వారఫలాలు
ఈవారం వృషభ రాశిలోని ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేయాలి. ఉదాసీనతను(Weekly Horoscope) దరి చేరనివ్వకూడదు.
- By Pasha Published Date - 09:08 AM, Sun - 5 January 25

Weekly Horoscope : మీకోసం పండితులు అందించిన వార ఫలాలు రెడీ. ఇక చదివేయండి. జనవరి 5 నుంచి జనవరి 11 వరకు ఉన్న వారానికి సంబంధించిన రాశిఫలాలను తెలుసుకోండి. మేష రాశి నుంచి మీన రాశి దాకా 12 రాశుల వారి వారఫలాలు ఇలా ఉన్నాయ్..
Also Read :Nagababu : 100 రోజుల తర్వాతే.. నాగబాబుకు మంత్రి పదవి ?
మేషం
ఈ వారం మేష రాశివారు ఆచితూచి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో అలర్ట్‌గా ఉండాలి. కొంతమంది బంధు మిత్రుల వల్ల మీకు నష్టం జరిగే ఛాన్స్ ఉంది.ఈ వారం మధ్యలో ఒక శుభవార్తను వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రాధాన్యం పెరగొచ్చు. మీ సంపాదన మార్గాలు సైతం పెరుగుతాయి.
వృషభం
ఈవారం వృషభ రాశిలోని ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేయాలి. ఉదాసీనతను(Weekly Horoscope) దరి చేరనివ్వకూడదు. ఆర్థిక వ్యవహారాల్లో మీరు తొందరపడొద్దు. మీ బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ సమయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీరు కొన్ని ఒత్తిళ్లు, సమస్యల నుంచి బయటపడతారు.
మిథునం
ఈవారం మిథున రాశివారు అలర్ట్ మోడ్‌లో ఉంటే బెటర్. ప్రత్యేకించి వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు ఓర్పుతో వ్యవహరించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. సున్నితమైన వ్యవహారాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబపరంగా కొన్ని చికాకులు తలెత్తే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచండి.
కర్కాటకం
ఈవారం కర్కాటక రాశివారు భారీ ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉంటే బెటర్. మీ కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీకు శత్రుదోషం నుంచి విముక్తి లభిస్తుంది. అప్పుల బాధలు దూరం అవుతాయి. అనుకోకుండా ఓ సమస్య సాల్వ్ అవుతుంది.
సింహం
ఈవారం సింహ రాశివారికి గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈక్రమంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోండి. ఉద్యోగులు తొందరపాటు వైఖరితో ఉండకూడదు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సమస్యలు ఎదురైతే మనోబలాన్ని కోల్పోవద్దు. దైవ బలంతో ముందుకు సాగండి.
కన్య
ఈవారం కన్య రాశివారు సాహసోపేతంగా వ్యవహరించాలి. ఉద్యోగులు.. ఉన్నతాధికారులతో సక్రమంగా ప్రవర్తించాలి. అనుకోకుండా వ్యక్తి గత సమస్యలు సాల్వ్ అవుతాయి. వారం మధ్యలో మీకు అదృష్ట యోగం ఉంది. అనుకోకుండా లాభపడతారు.
తుల
ఈవారం తుల రాశి వారు సమయోచిత నిర్ణయాలు తీసుకోవాలి. ప్రత్యేకించి వ్యాపారంలో చాలా అలర్ట్‌గా ఉండాలి. ప్రయాణాల్లో కేర్ ఫుల్‌గా ఉండాలి. సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం తగ్గనివ్వొద్దు.
వృశ్చికం
ఈవారం వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు జరుగుతాయి. వివాదాలు, ఒత్తిళ్ల నుంచి మీరు బయటపడే ఛాన్స్ ఉంది. మీ వల్ల పలువరికి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరిగి, ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.
ధనుస్సు
ఈవారం ధనుస్సు రాశి అనవసర విషయాలలోకి జోక్యం చేసుకోవద్దు. అపార్థాలకు తావు ఇవ్వకండి. ఆర్థిక లావాదేవీల్లో బీ అలర్ట్. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కష్టనష్టాలు తొలగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది.
మకరం
ఈవారం మకర రాశివారు కొన్నిసార్లు మంచి తలపెట్టినా కీడు జరిగే ముప్పు ఉంది. అందుకే అలర్ట్ మోడ్‌లో ఉండండి. ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శించకండి. మీ టార్గెట్‌ను సాధించే దాకా వెనకడుగు వేయకండి. డబ్బుకు సంబంధించి ఎవరికీ హామీలు ఇవ్వకండి.
Also Read :HMPV Virus China: చైనాలో ప్రాణాంతక వైరస్.. భారతదేశంపై ప్రభావం ఎంత?
కుంభం
ఈ వారం కుంభ రాశివారికి వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొన్ని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారు పైమెట్టుకు వెళ్తారు. వ్యాపారుల లాభాలు పెరుగుతాయి. ఒక సమస్య పరిష్కారంలో శ్రేయోభిలాషులు ముందుకొచ్చి సహకారాన్ని అందిస్తారు.
మీనం
ఈవారం మీన రాశివారు వ్యాపారంలో అత్యుత్సాహాన్ని, దూకుడును ప్రదర్శించకూడదు. ఆచితూచి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయండి. మీ బుద్ధి బలానికి పనిచెప్పండి. దైవబలం కూడా అవసరమని గుర్తుంచుకోండి. ఉద్యోగాల్లో ఉన్న పలువురికి టార్గెట్లు పెరిగే అవకాశం ఉంది.