Parliament: పార్లమెంట్ ను కుదిపేస్తున్న దాడి, ఒకేరోజు 78 సభ్యుల సస్పెన్షన్
- By Balu J Published Date - 05:56 PM, Mon - 18 December 23

Parliament: పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా, కెసి వేణుగోపాల్ సహా 45 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ సోమవారం సస్పెండ్ చేసింది. మిగిలిన శీతాకాల సమావేశాలకు 33 మంది సభ్యులను రాజ్యసభ నుండి సస్పెండ్ చేయగా, ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు మరో పదకొండు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.
పార్లమెంటు భద్రతా ఉల్లంఘనలపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు తమ నిరసనను కొనసాగించడంతో రాజ్యసభ కార్యకలాపాలు సోమవారం మూడుసార్లు వాయిదా పడ్డాయి. సభలో గందరగోళానికి కారణమైన ముప్పై మూడు మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) లోక్‌సభ నుండి సస్పెండ్ చేయబడిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. “గౌరవనీయులైన ఎంపీలు సభలో నిబంధనల ప్రకారం ప్రవర్తించాలని నేను అభ్యర్థిస్తున్నాను. మిమ్మల్ని మీరు అల్లరి దళంగా మార్చుకోవద్దు. ఈ గొప్ప సభ గౌరవాన్ని దిగజార్చవద్దు” అని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ అన్నారు.
పార్లమెంటుపై డిసెంబర్ 13న ఇద్దరు వ్యక్తులు భద్రతా ఉల్లంఘనలకు పాల్పడిన విషయం తెలిసిందే. సాగర్ శర్మ, మనోరంజన్ డి అనే ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి, దాడి చేసిన విషయం తెలిసిందే. భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
Also Read: PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన మోడీ