HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Supreme Court Is Impatient With The Behavior Of Trial Courts

Supreme Court : ట్రయిల్‌ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం

అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టుకు కూడా చేరలేదని.. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వస్తున్నాయని చెప్పింది.

  • Author : Latha Suma Date : 18-03-2025 - 4:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supreme Court is impatient with the behavior of trial courts
Supreme Court is impatient with the behavior of trial courts

Supreme Court : దర్యాప్తు పూర్తి అయినప్పటికీ చిన్న చిన్న నేరాల్లో దిగువ కోర్టులు బెయిల్ నిరాకరించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలా పని చేయకూదని హితవు పలికింది. ఒక చిన్న కేసులో బెయిల్‌ కోసం దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. సాధారణ కేసుల్లో సైతం నిందితులకు ఉపశమనం లభించకపోవడం దురదృష్టకరం అని.. అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టుకు కూడా చేరలేదని.. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వస్తున్నాయని చెప్పింది.

Read Also: What Is Autopen : ఏమిటీ ఆటోపెన్‌ ? బైడెన్ ఏం చేశారు ? నిప్పులు చెరిగిన ట్రంప్

రెండు దశాబ్దాల క్రితం.. చిన్న కేసుల్లో బెయిల్‌ పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టులకు చాలా అరుదుగా వచ్చేవి. ట్రయిల్‌ కోర్టు స్థాయిలో పరిష్కారం కావాల్సిన కేసులకు సంబంధించి బెయిల్‌ పిటిషన్ల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడమనేది దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనవసరంగా వ్యవస్థపై భారం పడుతోంది అని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇక్కడ నిజాలతో సంబంధం లేకుండా చట్టం అమలుచేసే సంస్థలు కొందరు వ్యక్తులను నిర్భందించేందుకు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తారు. అలా చేయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తెలిపింది.

సుప్రీంకోర్టు ఈ అంశాన్ని గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదు. చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసుల్లోను బెయిల్‌ మంజూరుచేయడంలో ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు మరింత ఉదారవాద వైఖరితో వ్యవహరించాలని సూచించింది. ఒక చిన్న కేసులో రెండేళ్లకు పైగా కస్టడీలో ఉన్న నిందితుడికి బెంచ్ బెయిల్ మంజూరుచేసింది. దర్యాప్తు పూర్తయి ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ను ట్రయల్‌ కోర్టు, గుజరాత్‌ హైకోర్టు తిరస్కరించాయి. మేజిస్ట్రేట్లు విచారించగలిగే కేసుల్లో బెయిల్‌ విషయాలను సుప్రీంకోర్టు ముందుకుతీసుకురావడం దురదృష్టకరమని అభయ్‌ ఎస్‌ ఓకా అసహనం వ్యక్తం చేశారు.

Read Also: Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bail
  • democratic country
  • High Court
  • Small case
  • Supreme Court
  • Trial Court

Related News

Telangana Cm Revanth Reddy

CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

2016 నాటి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. గతంలో ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు, రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ (Quash) తీర్పునిచ్చింది.

  • Ias Srilakshmi

    ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd