HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modi Letter To Sunita Williams

Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ

మోడీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో సునీతా విలియమ్స్‌ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు అని గుర్తు చేశారు.

  • Author : Latha Suma Date : 18-03-2025 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi letter to Sunita Williams
PM Modi letter to Sunita Williams

Sunita Williams : ప్రధాని మోడీ ఇండో-అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌కు లేఖ రాశారు. భారత్‌కు రావాలని లేఖ ద్వారా ఆహ్వానం పలికారు. సునీతా విలియమ్స్‌, విల్మోర్‌లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా అక్కడ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాసా వారిని భూమి మీదకు తీసుకురావడానికి ఇటీవల ఫాల్కన్-9 రాకెట్‌ను పంపింది. ఈ రాకెట్ ద్వారా మరికొన్ని గంటల్లో సునీతా భూమిపైకి రానుండడంతో భారత్‌కు రావాలని ప్రధాని లేఖ రాశారు.

Read Also: Junaid Khan: తీవ్ర విషాదం.. ఎండ కార‌ణంగా ఆస్ట్రేలియా క్రికెట‌ర్ మృతి

ఇక ఈ లేఖను కేంద్ర మంత్రి జితేందర్‌ సింగ్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. మోడీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో సునీతా విలియమ్స్‌ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు అని గుర్తు చేశారు. ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన సమావేశంలో సునీత విలియమ్స్‌ పేరును ప్రస్తావనకు తేవడమే కాదు, ఆమె సేవల్ని తమ సంభాషణలో ప్రస్తావనకు వచ్చిందని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు.

కాగా, ప్రధాని మోడీ గతంలో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఆయన్ను కలిశారు. అలాగే ఇటీవల అమెరికా వెళ్లి వైట్ హౌజ్‌లో డోనాల్డ్ ట్రంప్‌తోనూ భేటీ అయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ సునీత విలియమ్స్ యోగక్షేమాల గురించి వారిని ఆరాతీసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. 2024 జూన్ లో సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం అక్కడ వారు వారం రోజులే ఉండాల్సి ఉంది. కానీ వారు వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది ఖాళీగా భూమిమీదకు తిరిగొచ్చింది. వారు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. ఇక డిసెంబర్‌లో ఒకసారి, ఈ ఏడాది జనవరి చివర్‌లో మరోసారి ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ఎక్స్ ప్రయత్నించాయి. కానీ పలు సాంకేతిక సమస్యలతో ఆ ప్రయత్నాల్లో ముందడుగు పడలేదు. ఎట్టకేలకు 9 నెలల తరువాత ఇప్పుడు సునిత విలియన్స్, బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమ్మీదకు తిరిగొస్తున్నారు.

Read Also: Summer Clothes: ఈ వేస‌విలో ఎలాంటి బ‌ట్టలు వేసుకుంటే మంచిదో తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Astronaut
  • Barry Wilmore
  • letter
  • nasa
  • pm modi
  • space-station
  • Sunita Williams
  • Union Minister Jitender Singh

Related News

PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

PM Modi : ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. చంద్రబాబును మంచి మిత్రుడని, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసు

  • PM Modi

    12 ఏళ్ల‌లో తొలిసారి.. అసంతృప్తి వ్య‌క్తం చేసిన పీఎం మోదీ!

  • Lok Sabha Seats

    లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

Latest News

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

  • Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd