SBI Jobs : 1040 జాబ్స్ భర్తీకి ఎస్‌బీఐ భారీ నోటిఫికేషన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 1040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- Author : Pasha
Date : 20-07-2024 - 4:51 IST
Published By : Hashtagu Telugu Desk
SBI Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 1040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా 643 వీపీ వెల్త్ పోస్టులు, 273 రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. 49 ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పోస్టులు, 32 రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) పోస్టులు, 30 ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఇక 6 రీజినల్ హెడ్ పోస్టులు, 2 సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రోడక్ట్ లీడ్) పోస్టులు, 2 సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్) పోస్టులు, 2 ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్) పోస్టులు ఉన్నాయి. 1 ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ) పోస్టు(SBI Jobs) ఉంది.
Also Read :CM Revanth Reddy: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు సీఎం రేవంత్ లక్ష సాయం
అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. అనంతరం వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులను జాబ్స్ ఇస్తారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు https://sbi.co.in/web/careers వెబ్సైట్ ద్వారా అప్లై చేయొచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఓబీసీ, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు. అప్లికేషన్ల ప్రక్రియ జులై 19న ప్రారంభమైంది. ఆగస్టు 8 వరకు అప్లై చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
- సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్) పోస్టులకు అప్లై చేయాలంటే.. ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీబీఎం లేదా సీఏ/ సీఎఫ్ఏ చదివి ఉండాలి. NISM ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్/ రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికెట్/ సీఎఫ్పీ/ ఎన్ఐఎస్ఎం 21A లేదా 21B ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అభ్యర్థుల వయస్సు 30 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలి.
- రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయాలంటే ఏదైనా డిగ్రీలో పాసై ఉండాలి. వెల్త్ మేనేజ్మెంట్లో 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 23 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.
- ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ పోస్టులకు ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీబీఎంలో పాసై ఉండాలి. లేదంటే సీఏ/ సీఎఫ్ఏ చదివి ఉండాలి. కనీసం ఆరేళ్ల పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు(SBI SCO Jobs) 35 నుంచి 50 ఏళ్లలోపు ఉండాలి.