Ramnath kovind: రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ చివరి సందేశం…విందులో పాల్గొన్న మొగులయ్య..!!
భారతరాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
- Author : hashtagu
Date : 23-07-2022 - 8:05 IST
Published By : Hashtagu Telugu Desk
భారతరాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి హోదాలో కోవింద్ తన చివరి సందేశాన్ని వినిపించారు. రాజకీయాలకు అతీతంగా దేశాభివ్రుద్ది జరగాలని ఆకాంక్షించారు. జాతీయ ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమానికి ఏం అవసరమో నిర్ణయించుకోవాలని రాజకీయ పక్షాలకు సూచించారు.
కాగా పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు కోవింద్. ఉభయ సభల్లో చర్చలు జరిగేటప్పుడు సభ్యుు గాంధేయవాదాన్ని అనుసరించాలని హితవు పలికారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఆమె మార్గదర్శనంలో దేశం లబ్ది చేకూరని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఈ విందులో తెలంగాణకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య హాజరయ్యారు. విందులో పాలుపంచుకున్న ఆయనతో కిషన్ రెడ్డి ఫొటో దిగారు.
