Congress First List : రాజస్థాన్‌లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్
Congress First List : త్వరలో అసెంబ్లీ పోల్స్ జరగనున్న ఇతర రాష్ట్రాల కంటే చాలా ఆలస్యంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజైంది.
- By Pasha Published Date - 03:59 PM, Sat - 21 October 23

Congress First List : త్వరలో అసెంబ్లీ పోల్స్ జరగనున్న ఇతర రాష్ట్రాల కంటే చాలా ఆలస్యంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజైంది. ఎట్టకేలకు ఇవాళ 33 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ లిస్టు ప్రకారం.. సర్దార్‌పురా నుంచి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, టోంక్ నుంచి సచిన్ పైలట్ బరిలోకి దిగనున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోత్సారాను లచ్మాన్‌గఢ్ నుంచి, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని నాథ్‌ద్వారా నుంచి పోటీకి నిలిపారు. హిందోలి నుంచి క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి అశోక్ చందనా, అల్వార్ రూరల్ నుంచి సామాజిక న్యాయ మంత్రి టికారమ్ జుల్లీ, సికార్ నుంచి స్త్రీ , శిశు సంక్షేమ మంత్రి మమతా భూపేష్, జలవనరుల మంత్రి మహేంద్ర జీత్ సింగ్ మాల్వియా బగిదోర నుంచి పోటీకి దిగనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నోహర్ నుంచి రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అమిత్ చచ్చన్, కొలయత్ నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భన్వర్ సింగ్ భాటి, సదుల్‌పూర్ నుంచి ప్రముఖ క్రీడాకారిణి కృష్ణ పూనియా బరిలో నిలిచారు. 33 మంది అభ్యర్థుల జాబితాలో తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ పోల్స్ లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 72 మాత్రమే గెలుచుకుంది.