Beach Soccer : నేషనల్ గేమ్స్‌లోకి మరో కొత్త ఆట.. ఏదో తెలుసా ?
Beach Soccer : ఈనెల 26 నుంచి గోవా వేదికగా జరగనున్న నేషనల్ గేమ్స్‌లో మరో కొత్త స్పోర్ట్స్ ఈవెంట్ చేరింది.
- By Pasha Published Date - 03:38 PM, Sat - 21 October 23

Beach Soccer : ఈనెల 26 నుంచి గోవా వేదికగా జరగనున్న నేషనల్ గేమ్స్‌లో మరో కొత్త స్పోర్ట్స్ ఈవెంట్ చేరింది. అదే బీచ్ ఫుట్‌బాల్. దీనిపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF) ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. నేషనల్ గేమ్స్ కోసం ఎనిమిది బీచ్ ఫుట్ బాల్ జట్లను రెండు గ్రూపులుగా విభజించామని తెలిపింది. గ్రూప్-ఎలో కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, లక్షద్వీప్‌లు.. గ్రూప్-బిలో పంజాబ్, ఉత్తరాఖండ్, ఒడిశా, గోవా ఉంటాయని పేర్కొంది. వాస్తవానికి నేషనల్ గేమ్స్‌లో బీచ్ ఫుట్ బాల్ ను చేర్చే దిశగా ఈ ఏడాది ప్రారంభంలోనే AIFF కసరత్తును ప్రారంభించింది. ఈక్రమంలోనే సూరత్‌లోని డుమాస్ బీచ్ వేదికగా పురుషుల జాతీయ బీచ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించింది. దానికి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు నేషనల్ గేమ్స్ లో చేరుస్తూ నిర్ణయం (Beach Soccer) తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
బీచ్ ఫుట్‌బాల్ ఆడటం తొలుత బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ప్రారంభమైంది. ఎరిక్ కాంటోనా , మిచెల్ , జూలియో సాలినాస్ , రొమారియో , జూనియర్ అండ్ జికోలకు అంతర్జాతీయ బీచ్ ఫుట్ బాల్ ప్లేయర్స్ గా పేరుంది. బీచ్ సాకర్ ను బీచ్ ఫుట్‌బాల్ , సాండ్ ఫుట్‌బాల్, బీసల్ అని కూడా పిలుస్తారు. మొదటి అంతర్జాతీయ స్థాయి బీచ్ ఫుట్ బాల్ మ్యాచ్‌లు 1993లో పురుషులకు నిర్వహించారు. తొలిసారి మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో బీచ్ ఫుట్ బాల్ పోటీలను 2009లో నిర్వహించారు.