Haryana Election 2024: వినేష్ ఫోగట్ కు లైన్ క్లియర్, రాజీనామాను ఆమోదించిన రైల్వే శాఖ
Haryana Election 2024: బజరంగ్ పునియా మరియు వినేష్ ఫోగట్ రాజీనామాను ఉత్తర రైల్వే శాఖ ఆమోదించింది. ఇప్పుడు వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రెజ్లర్లిద్దరూ తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. గతంలో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది.
- By Praveen Aluthuru Published Date - 12:57 PM, Mon - 9 September 24

Haryana Election 2024: హర్యానా ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రెజ్లర్ల ఎంట్రీతో రాష్ట్రంలో ఎన్నికల హడావుడి పతాకస్థాయికి చేరుకుంది. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెజ్లర్లకు లైన్ క్లియర్ అయింది. వినేష్ ఫోగట్ (Vinesh Phogat) మరియు బజరంగ్ పునియా హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana Elections)కు ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ ఆమెను జులనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపింది. అదే సమయంలో బజరంగ్‌కు ఇంకా టిక్కెట్ దక్కలేదు. ఇదిలా ఉంటే వీరిద్దరూ తమ రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాగా వారిద్దరి రాజీనామాలను ఉత్తర రైల్వే ఆమోదించింది.
వినేష్ ఫోగట్ రాజీనామాలను ఉత్తర రైల్వే ఆమోదించింది. దీంతో వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. అంతకుముందు కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రెజ్లర్లిద్దరూ తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అయితే వీరిద్దరి రాజీనామాలను ఆమోదించేందుకు రైల్వే నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. మూడు నెలల నోటీసు పీరియడ్ నిబంధన కారణంగా ఫోగట్ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని ఊహాగానాలు వచ్చాయి. నిబంధనల ప్రకారం రైల్వే శాఖ నుంచి రిలీవ్ అయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ రెజ్లర్లిద్దరిపై పొలిటికల్ దాడి చేశారు. మల్లయోధుల ఉద్యమమంతా నా పరువు తీసేందుకే అని అన్నారు. మల్లయోధుల ఉద్యమం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read: Vivo T3 Ultra Launch: త్వరలోనే మార్కెట్ లోకి వివో టీ3 అల్ట్రా.. లాంచ్ అయ్యేది అప్పుడే!