Rahul Gandhi: ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా హెచ్చరించిన రాహుల్ గాంధీ
- Author : Latha Suma
Date : 29-03-2024 - 6:51 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi: కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీ(bjp)ని, ఆ పార్టీ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి రూ.1800 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు అందడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘ప్రభుత్వం మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మళ్లీ ఇలాంటివి చేసే ధైర్యం ఎవరూ చేయని విధంగా చర్యలుంటాయి. ఇది నా హామీ’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
जब सरकार बदलेगी तो ‘लोकतंत्र का चीरहरण’ करने वालों पर कार्रवाई ज़रूर होगी!
और ऐसी कार्रवाई होगी कि दोबारा फिर किसी की हिम्मत नहीं होगी, ये सब करने की।
ये मेरी गारंटी है।#BJPTaxTerrorism pic.twitter.com/SSkiolorvH
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2024
ఆదాయపు పన్ను వంటి కేంద్ర శాఖలు బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమకు జారీ చేసిన పన్ను డిమాండ్ల రద్దు కోసం సుదీర్ఘ న్యాయపోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నదని తెలిపారు. ఐటీ నోటీస్‌ను ‘ఉగ్ర పన్ను’గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఐటీ విభాగం మరోసారి కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలనను నిలిపేయాలన్న కాంగ్రెస్ పిటిషన్లను గురువారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు జరిగాయి. కాగా, మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Also: Swimming: వేసవిలో ఈత నేర్చుకునేందుకు ఒంటరిగా వెళ్తున్నారా?