Bomb Scare : బాంబులు, ఉగ్రవాదుల కలకలం.. ఆ రైలులో గంటల తరబడి తనిఖీలు
దీంతో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆ రైలును ఉత్తరప్రదేశ్‌లోని తుండ్ల రైల్వే స్టేషన్‌లో(Bomb Scare) ఆపేశారు.
- By Pasha Published Date - 12:58 PM, Thu - 10 October 24

Bomb Scare :‘‘ఆ ట్రైన్‌లో ఉగ్రవాదులున్నారు.. బాంబులతో ప్రయాణిస్తున్నారు’’ అంటూ ఒక ‘ఎక్స్’ (ట్విట్టర్) యూజర్ నుంచి సమాచారం అందడంతో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. పూరీ – న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ను వెంటనే ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆ రైలును ఉత్తరప్రదేశ్‌లోని తుండ్ల రైల్వే స్టేషన్‌లో(Bomb Scare) ఆపేశారు.దాదాపు మూడున్నర గంటల పాటు (తెల్లవారుజామున 6 గంటల వరకు) రైలులో రైల్వే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
Also Read :Ratan Tata : వీధి కుక్కల కోసం గొంతు వినిపించిన ఘనుడు రతన్ టాటా
అనుమానాస్పద వస్తువులు, లగేజీలు అన్నీ తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా ఈ తనిఖీల కోసం వాడుకున్నారు. అయితే పేలుడు పదార్థాలేం ట్రైనులో లేవని తేలింది. దీంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రైలును పంపేందుకు అనుమతులు జారీ చేశారు. ఇక ఈ తప్పుడు సమాచారాన్ని పంపి ఎంతోమంది రైల్వే ప్రయాణికులు, అధికారుల సమయాన్ని వేస్ట్ చేసిన వారిని గుర్తించే దిశగా దర్యాప్తు జరుగుతోంది. ఎక్స్ వేదికగా ఆ పోస్ట్ చేసింది ఎవరు ? ఎక్కడి నుంచి ఆ పోస్ట్ చేశారు ? ఎందుకు ఇలాంటి పోస్ట్ చేశారు ? అనేది తెలుసుకునే దిశగా విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు.
Also Read :Ratan Tata : నానో కార్స్ టు టాటా స్కై.. ఎయిరిండియా టు బిగ్ బాస్కెట్.. రతన్ టాటా బిగ్ డీల్స్
గత సంవత్సరం కూడా మే 1న ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. పూరీ-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లో బాంబు అమర్చామని అప్పట్లో వార్నింగ్ మెసేజ్‌ను స్టేషన్ మాస్టర్‌కు పంపారు. ఝింగురా స్టేషన్ సమీపంలో రైలులో పేలుడు జరుగుతుందని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు. దీంతో అప్పట్లో మిర్జాపూర్‌లోని చునార్ రైల్వే స్టేషన్‌లో పూరీ-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ను చాలాసేపు ఆపారు. చివరకు రైలులు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అక్కడి నుంచి ట్రైన్‌ను పంపేశారు. ఇటీవల కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు. ఇనుప రాడ్లు, సిమెంటు దిమ్మెలను పెడుతూ రైల్వే ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది.