Ratan Tata : వీధి కుక్కల కోసం గొంతు వినిపించిన ఘనుడు రతన్ టాటా
2021లో రతన్ టాటా (Ratan Tata) సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు.
- Author : Pasha
Date : 10-10-2024 - 12:26 IST
Published By : Hashtagu Telugu Desk
Ratan Tata : రతన్ టాటా పేదల సంక్షేమం ఎంతో పరితపించారు. టాటా ట్రస్టు దేశవ్యాప్తంగా ఎన్నో ఆస్పత్రులను పేదల కోసం నడుపుతోంది. రతన్ టాటాకు మూగజీవాలపైనా ఎంతో సానుభూతి ఉండేది. వాటి సంరక్షణ ప్రాధాన్యతను తెలుపుతూ ఆయన తరుచుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ప్రత్యేకించి వీధి కుక్కల సేఫ్టీపై రతన్ టాటా ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు. వీధికుక్కల సంక్షేమం కోసం పనిచేసే సంస్థలకు టాటా ట్రస్టు ద్వారా సహాయ సహకారాలను అందించేవారు. ఆయన స్వయంగా ఇంట్లో కుక్కలను పెంచేవారు. 2021లో రతన్ టాటా (Ratan Tata) సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. వర్షం కురుస్తుండగా.. తాజ్ హోటల్ ఉద్యోగి ఒకరు గొడుగు పట్టి మరీ వర్షపు జల్లుల నుంచి వీధి కుక్కను రక్షించే ఫొటోను ఆ పోస్ట్‌కు జతపరిచారు. వీధికుక్కపై సదరు వ్యక్తి చూపిన దయను కొనియాడుతూ రతన్ టాటా కామెంట్స్ పెట్టారు.
Also Read :Ratan Tata : నానో కార్స్ టు టాటా స్కై.. ఎయిరిండియా టు బిగ్ బాస్కెట్.. రతన్ టాటా బిగ్ డీల్స్
స్మాల్ యానిమల్ హాస్పిటల్ (SAHM)ను రతన్ టాటా ముంబైలో స్థాపించారు. దీనిలో నిత్యం ఎన్నో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలకు చికిత్స జరుగుతుంటుంది. ఇందులో అత్యాధునిక వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు కూడా రతన్ టాటా ఎంతగా ప్రాధాన్యం ఇచ్చేవారో తెలుసుకోవాలంటే.. ఓసారి ఈ హాస్పిటల్‌ను చూడాలి.
Also Read :Sahara Floods: ఎడారిలో వరదలు.. 50 ఏళ్ల తర్వాత నిండిపోయిన సరస్సు
- 2018 సంవత్సరంలో రతన్ టాటా బ్రిటీష్ రాజ కుటుంబం నుంచి ప్రతిష్ఠాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. కింగ్ చార్లెస్ III (అప్పటి ప్రిన్స్ చార్లెస్), బ్రిటీష్ ఆసియన్ ట్రస్ట్ ఈ వేడుకను నిర్వహించింది. తొలుత ఈ వేడుకకు వెళ్లాలని రతన్ టాటా భావించారు. అయితే అనారోగ్యంతో ఉన్న తన కుక్కను చూసుకోవడానికి ఆయన ఇంట్లోనే ఉండిపోయారు.
- రతన్ టాటా ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలలో ఆయనకు అత్యంత సన్నిహితమైన దాని పేరు గోవా. రతన్ టాటా ఓసారి గోవాకు వెళ్లినప్పుడు ఆ కుక్క పిల్లను చూసి, ఇంటికి తీసుకొచ్చారు. టాటా కార్పొరేట్ ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్‌లో అది పెరిగింది.