PM Modi : మరోసారి బీజేపీ సర్కార్..హర్యానా ప్రజానీకం చెబుతుంది: ప్రధాని మోడీ
Haryana: బీజేపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రాల్లో హర్యానా ఒకటని ప్రధాని అన్నారు. పారిశ్రామికీకరణ జరిగినప్పుడు పేదలు, రైతులు, దళితులు ఎక్కువగా ప్రయోజనాలు పొందారని చెప్పారు.
- By Latha Suma Published Date - 05:01 PM, Wed - 25 September 24
Haryana Assembly Election Campaign: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ సోనిపట్ జిల్లాలోని రోహ్‌తక్-పానిపట్ హైవే బైపాస్ వెంబడి బుధవారం నాడు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోతోందని, బీజేపీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని అన్నారు. హర్యానాను మధ్యవర్తులు , అల్లుళ్లు కు కాంగ్రెస్ అప్పగించిందని అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవినీతి, ఆశ్రిత పక్షపాతం తప్పనిసరని, ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని తీసుకువచ్చింది. దేశంలో అవినీతికి జన్మ స్థానమైనది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.
Read Also: YS Jagan : లడ్డూ వివాదం..కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
బీజేపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రాల్లో హర్యానా ఒకటని ప్రధాని అన్నారు. పారిశ్రామికీకరణ జరిగినప్పుడు పేదలు, రైతులు, దళితులు ఎక్కువగా ప్రయోజనాలు పొందారని చెప్పారు. హర్యానాను ‘మెడల్ ఫ్యాక్టరీ’గా మోడీ అభివర్ణించారు. అంతర్జాతీయ పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అనేక మెడల్స్ తెచ్చుకుంటున్నారని అభినందించారు. కాగా, 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.