HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modi Launched Two Vande Bharat Trains To Telugu States

PM Modi : తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్‌ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ

Two Vande Bharat trains to Telugu states : దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.

  • Author : Latha Suma Date : 16-09-2024 - 6:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi launched two Vande Bharat trains to Telugu states
PM Modi launched two Vande Bharat trains to Telugu states

Two Vande Bharat trains to Telugu states: ప్రధాని మోడీ సోమవారం దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది విశాఖపట్నం నుంచి ప్రయాణించే నాలుగోది. రాయ్‌పుర్‌-విజయనగరం మార్గంలో ఇది మొదటిది. దీంతో పాటు నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోడీ ప్రారంభించారు. నాగ్‌పుర్‌లో బయల్దేరే ఈ రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రాత్రి 10.45 గంటలకు చేరకుంటుంది.

ఈ నెల 20 నుంచి ఈ రైలు అందుబాటులోకి..

సికింద్రాబాద్‌-నాగ్‌పుర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. దుర్గ్-విశాఖపట్నం (20829) వందే భారత్.. దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు(గురువారాలు మినహా) 05.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 13.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-దుర్గ్ (20830) వందే భారత్ విశాఖపట్నం నుంచి వారానికి 6 రోజులు (గురువారాలు మినహా) 14.50 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 22.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరగనుంది.

ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయి..

వందేభారత్‌ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు తన ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయన్నారు. అయితే, ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయి. ఎంతో అవమానించాయి. అయితే.. ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నా. 100 రోజుల ప్రభుత్వ ప్రణాళికను పూర్తి చేయడంపైనే దృష్టి సారించా” అని తెలిపారు.

ఈ శతాబ్దం మన దేశానికి బంగారు కాలం..

”దేశాభివృద్ధి కోసం ఎలాంటి అవకాశం వదులుకోలేదు. విదేశాల్లోనూ మన అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరిగాయి. ఈ వంద రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చాం. వేగంగా ఆ పనులు చేపడతాం. గ్రామ, పట్టణ ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నాం” అని మోడీ పేర్కొన్నారు. ఒకవైపు దేశంలోని ప్రతి పౌరుడు ప్రపంచంలో భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ కావాలని కోరుకుంటుంటే.. మరోవైపు కొంతమంది మాత్రం తప్పుడు పనులు చేస్తూ.. దేశ సమైక్యతపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ఈ శతాబ్దం మన దేశానికి బంగారు కాలమని.. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Manipur : మణిపూర్ జిల్లాల్లో ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తివేత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Durg - Visakhapatnam
  • Nagpur-Secunderabad
  • New Vande Bharat Trains
  • pm modi
  • telangana

Related News

Rising COVID-19 cases in AP

COVID: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో చాప కింద నీరులా కరోనా మళ్లీ విస్తరిస్తోంది. ఒకప్పుడు కరోనా సృష్టించిన విలయతాండవం ఎవ్వరూ మరచిపోలేనిది. తల్లడిల్లుతూ పోయిన ప్రాణాలు ఇప్పటికీ కళ్ల ముందే కదులుతున్నాయి. అలాంటి మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసిన కోవిడ్ పాజిటివ్ కేసుల నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో పరీక్షించగా, అవి RF 5

  • 9 arrested in Guntur case involving the stripping of a woman.

    Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

  • Major twist in the Kadambari Jethwani intimidation case; the net closes in on the YCP leader.

    Kadambari Jethwani: కాదంబరి జెత్వాని బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత చుట్టూ ఉచ్చు.

  • Ram Mohan Naidu shared the first look of the 'Made-in-India' C-295 military aircraft.

    Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.

  • Farmers should not rush into paddy transplantation – Ministers issue a crucial warning to farmers.

    El Nino Effect: రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు.. రైతులకు మంత్రుల కీలక హెచ్చరిక

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd