PM Modi :”జన్‌ధన్”కు పదేళ్లు..ప్రధాని మోడి స్పందన
ఈ పథకం విజయవంతం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ''సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి.. ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో ఈ పథకం అత్యంత ముఖ్యమైంది.
- By Latha Suma Published Date - 06:15 PM, Wed - 28 August 24

Pradhan Mantri Jan Dhan Yojana scheme: ఈరోజుతో ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’ పథకానికి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం విజయవంతం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ”సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి.. ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో ఈ పథకం అత్యంత ముఖ్యమైంది. ఇది దేశ ప్రజల గౌరవం, సాధికారత, దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపేందుకు ఎంతో ఉపయోగపడింది” అని ప్రత్యేక పోస్టులో ప్రధాని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంకు ఖాతా అయినా ఉండేటట్లు చూడటం జన్‌ధన్ పథకం ప్రధాన లక్ష్యం. ”మీలో చాలా మంది ముఖ్యంగా యువత.. ఈ పథకం ఎందుకు అంత ముఖ్యమైందని ఆలోచిస్తారు..? ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండడం ఎంతో ముఖ్యం. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు దాదాపు ఎన్నో సామాన్య కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. దీని వల్ల సామాన్యుల సొత్తు చోరీ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఆర్థిక భద్రత లేకపోవడంతో ప్రజల ఆశలు కలలుగా మిగిలేవి” అని అన్నారు.
Read Also: Pushpa 2: పుష్ప -2 నుంచి పోస్టర్ రిలీజ్.. 100 రోజుల్లో అంటూ..
”జన్‌ధన్ యోజన ప్రారంభించినప్పుడు.. దాని చుట్టూ ఉండే సమస్యలు, సందేహాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం సాధ్యమవుతుందా..? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ, ఈ ప్రయత్నం మంచి మార్పుకు దారి తీస్తుందని నమ్మాను. 53 కోట్ల మందికి పైగా ప్రజలు బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. ఇది ఊహించని పరిణామం. ప్రస్తుతం ఈ ఖాతాల్లో డిపాజిట్ల బ్యాలెన్సు రూ. 2. 3 లక్షల కోట్లు. వీటిలో 65 శాతానికి పైగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల వారు ఉండడం విశేషం. అంతేకాకుండా ఈ పథకం ద్వారా మహిళా సాధికారతను సాధించాం. దాదాపు 30 కోట్ల మందికి పైగా మహిళలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురాగలిగాం” అని ప్రధాని పేర్కొన్నారు.
కాగా, దేశ ప్రజల సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’ పథకానికి నేటితో పదేళ్లు..ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో సమ్మిళిత అభివృద్ధికి తోడ్పేందుకు రూపొందించిన ఎన్నో ఆర్థిక పథకాల్లో ఇదీ ఒకటి.