Israel-Hamas Conflict: ఐక్యరాజ్యసమితి తీర్మానానికి మోడీ ఎందుకు దూరంగా ఉన్నాడు?
ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గైర్హాజరయ్యిందని విమర్శించారు.
- Author : Praveen Aluthuru
Date : 28-10-2023 - 6:03 IST
Published By : Hashtagu Telugu Desk
Israel-Hamas Conflict: ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గైర్హాజరయ్యిందని విమర్శించారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై పౌరుల జీవితాల రక్షణ కోసం జరిపిన సమావేశానికి దూరంగా ఉండటం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఒవైసి చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పరిస్థితులు మరింత దిగజారిపోయాయని, ఇది రాజకీయ సమస్య కాదని, ఇది మానవతా సమస్య అని ఆయన అన్నారు.
గాజాలో ఇజ్రాయెల్ చేత 7,028 మంది చంపబడ్డారు. అందులో 3,000 మంది పిల్లలు మరియు 1700 మంది మహిళలు ఉన్నారు. గాజాలో కనీసం 45 శాతం గృహాలు ధ్వంసమయ్యాయి. ఇది మానవతా సమస్య, రాజకీయ సమస్య కాదు. తీర్మానానికి దూరంగా ఉన్నారు. గ్లోబల్ సౌత్‌లో, దక్షిణాసియాలో & బ్రిక్స్‌లో భారతదేశం ఒంటరిగా ఉంది. ప్రజలు జీవితాలకు సంబంధించిన సమస్యకు భారతదేశం ఎందుకు దూరంగా ఉంది? ఒకే ప్రపంచం ఒక కుటుంబం నినాదం మీరే కదా ఇచ్చింది అంటూ అసదుద్దీన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
నరేంద్రమోడీ హమాస్ దాడిని ఖండించారు కానీ సంధి కోరుతూ ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అంగీకరించలేకపోయారు. మోడీ కొన్ని రోజుల క్రితం జోర్డాన్ రాజుతో మాట్లాడాడు కానీ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి దూరంగా ఉన్నాడు. ఇది అస్థిరమైన విదేశాంగ విధానం అంటూ మోడీపై ఆరోపణలు గుప్పించారు.
Also Read: TCongress: టీకాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ పార్టీకి రాజీనామా