TCongress: టీకాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ పార్టీకి రాజీనామా
- Author : Balu J
Date : 28-10-2023 - 5:57 IST
Published By : Hashtagu Telugu Desk
TCongress: తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ ఛైర్మెన్ షేక్ అబ్దుల్లా సోహెల్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఖర్గే కు నా రాజీనామా లెటర్ పంపారు. 34 సంవత్సరాలు పార్టీకోసం ఎంతో కృషి చేశానని, కాంగ్రెస్ పార్టీ rss చెప్పు చేతుల్లో ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ గందరగోళం పై పోను పోను హై కమాండ్ కు తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరికి అయితే పార్టీ టికెట్స్ కట్టబెట్టిర్రో అందులో 20 శాతం మంది కాంగ్రెస్ పార్టీ మనుషులు కాదు అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనేక చోట్లా టికెట్లు అమ్ముకుందని అబ్దుల్లా అన్నారు. పార్టీ కోసం ఎలాంటి ధర్నా లు ,జెండా మోయలేని వాళ్ళు టికెట్స్ పొందారని షేక్ అబ్దుల్లా సోహెల్ అన్నారు.