Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు (Odisha Train Accident) ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
- Author : Gopichand
Date : 03-06-2023 - 6:43 IST
Published By : Hashtagu Telugu Desk
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు (Odisha Train Accident) ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి దేశంలోని పలువురు నేతల వరకు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రధాని కార్యక్రమాల్లో కూడా మార్పులు చేశారు. వార్తా సంస్థ పిటిఐ ప్రకారం.. శనివారం ముంబై-గోవాకు మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు. ఇది వాయిదా పడింది. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ ప్రధాని ట్వీట్ చేయడంతోపాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కూడా మాట్లాడారు.
ప్రమాదం తర్వాత నష్టపరిహారం ప్రకటన
ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరకు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై విపక్షాలతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ బాధాకరమైన ప్రమాదానికి సంబంధించి పరిహారం కూడా ప్రకటించారు. రైలు ప్రమాదంలో గాయపడిన పలువురిని సోరో, గోపాల్‌పూర్, ఖాంతాపాడ ఆరోగ్య కేంద్రాల్లో చేర్చగా, చాలా మందిని బాలాసోర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చేర్చారు.
Also Read: Coromandel Express: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. 233కి చేరిన మృతుల సంఖ్య
పరిహారం ప్రకటించింది
అదే సమయంలో ప్రమాదం తర్వాత, రైల్వే మంత్రిత్వ శాఖ పరిహారం ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మృతుల బంధువులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్రధాని మోదీ సంతాపం
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రైలు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి ప్రధాని మోదీ ప్రకటించారు.
ఈ ఘటనపై రైల్వే మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రమాదం దురదృష్టకరమని, సంఘటన గురించి తెలిసిన కొద్దిసేపటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైందని చెప్పారు. రైలు ఎలా పట్టాలు తప్పిందో తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించానని, ఈ విషాద ప్రమాదానికి మూలకారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమని రైల్వే మంత్రి అన్నారు.
చాలా రైళ్ల రూట్ మార్చారు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో రైలు పట్టాలు తప్పిన ప్రాంతంలో కొన్ని రైళ్లను మళ్లించగా, పలు రైళ్లు రద్దు చేయబడ్డాయి.