NDA Lead : 154 స్థానాల్లో ఎన్డీయే లీడ్.. 96 స్థానాల్లో ఇండియా లీడ్
దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 154 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది.
- Author : Pasha
Date : 04-06-2024 - 8:37 IST
Published By : Hashtagu Telugu Desk
NDA Lead : దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 154 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకుగానూ 131 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉంది. గతంలోనే సూరత్ లోక్‌సభ స్థానంలో బీజేపీ(NDA Lead) ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇక జేడీయూ 6 స్థానాల్లో, టీడీపీ 6 స్థానాల్లో లీడ్‌లో దూసుకుపోతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
| Party/Alliance | 2024 Leads | 2024 Wins | 2024 Total |
|---|---|---|---|
| NDA | 154 | 1 | 155 |
| BJP | 131 | 1 | 132 |
| JD(U) | 6 | 0 | 6 |
| TDP | 6 | 0 | 6 |
| LJPRV | 3 | 0 | 3 |
| SHS | 3 | 0 | 3 |
| JD(S) | 2 | 0 | 2 |
| IND | 2 | 0 | 2 |
మరోవైపు ఇండియా కూటమి మాత్రం కేవలం 96 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ 48 చోట్ల ఆధిక్యంలో ఉంది. 11 చోట్ల సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే 7 చోట్ల, సీపీఎం 7 చోట్ల లీడ్‌లో ఉంది. టీఎంసీ పార్టీ 6 చోట్ల, ఆర్జేడీ పార్టీ 5 చోట్ల ముందంజలో ఉన్నాయి.
| INDIA | 96 | 0 | 96 |
| INC | 48 | 0 | 48 |
| SP | 11 | 0 | 11 |
| DMK | 7 | 0 | 7 |
| CPM | 7 | 0 | 7 |
| AITC | 6 | 0 | 6 |
| RJD | 5 | 0 | 5 |
| SHS (UBT) | 3 | 0 | 3 |
| IUML | 2 | 0 | 2 |