Narendra Modi : వందే భారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
- Author : Kavya Krishna
Date : 12-03-2024 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మార్చి 12, మంగళవారం నాడు 10 కొత్త వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains)ను ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 50కి పైగా చేరింది. దేశవ్యాప్తంగా 45 మార్గాలను కవర్ చేశారు. ప్రస్తుతం, భారతీయ రైల్వేలు 24 రాష్ట్రాలు, 256 జిల్లాల్లో విస్తరించి ఉన్న బ్రాడ్ గేజ్ (BG) విద్యుద్దీకరణ నెట్‌వర్క్‌లతో రాష్ట్రాలను కలుపుతూ 41 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను నిర్వహిస్తోంది. ఢిల్లీ-కత్రా, ఢిల్లీ-వారణాసి, ముంబై-అహ్మదాబాద్, మైసూరు-చెన్నై, కాసరగోడ్-తిరువనంతపురం, మరియు ఇప్పుడు విశాఖపట్నం-సికింద్రాబాద్ సహా ఆరు రూట్లలో రెండు వందేభారత్ రైళ్లు నడపబడతాయి.
We’re now on WhatsApp. Click to Join.
వందే భారత్ రైళ్లు ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న విద్యుదీకరించబడిన బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లపై నడుస్తాయి. డిసెంబర్ 2023లో, ప్రధానమంత్రి ఆరు అదనపు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఇవి కత్రా నుండి న్యూఢిల్లీకి అనుసంధానించే రెండవ రైలును కలిగి ఉన్నాయి. ఇతర మార్గాలలో అమృత్‌సర్ నుండి ఢిల్లీ, కోయంబత్తూరు నుండి బెంగళూరు, మంగళూరు నుండి మడ్‌గావ్, జల్నా నుండి ముంబై మరియు అయోధ్య నుండి ఢిల్లీ ఉన్నాయి. ఢిల్లీ మరియు వారణాసి మధ్య రెండవ రైలు కూడా డిసెంబర్ 2023 లో ప్రారంభించబడింది.
కొత్త వందే భారత్ రైళ్ల మార్గాలు ఇలా..
అహ్మదాబాద్-ముంబై సెంట్రల్
సికింద్రాబాద్-విశాఖపట్నం
మైసూరు- డా. MGR సెంట్రల్ (చెన్నై)
పాట్నా- లక్నో
కొత్త జల్పైగురి-పాట్నా
పూరి-విశాఖపట్నం
లక్నో – డెహ్రాడూన్
కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు
రాంచీ-వారణాసి
ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్).
నాలుగు వందేభారత్ రైళ్ల పొడిగింపును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు.
అహ్మదాబాద్-జామ్‌నగర్ వందే భారత్ ద్వారక వరకు పొడిగించబడుతోంది. అజ్మీర్- ఢిల్లీ సరాయ్ రోహిల్లా వందే భారత్ చండీగఢ్ వరకు పొడిగించబడుతోంది. గోరఖ్‌పూర్-లక్నో వందే భారత్ ప్రయాగ్‌రాజ్ వరకు పొడిగించబడుతోంది. తిరువనంతపురం-కాసర్‌గోడ్ వందే భారత్‌ను మంగళూరు వరకు పొడిగిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో వందేభారత్ రైళ్లకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. 10 రైళ్లు రాజధానిలో ముగుస్తాయి. ఈ రైళ్లు ఢిల్లీని డెహ్రాడూన్, అంబ్ అందౌరా, భోపాల్, అయోధ్య, అమృత్‌సర్ మరియు ఇప్పుడు ఖజురహో వంటి వివిధ గమ్యస్థానాలకు కలుపుతాయి.
Read Also : Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పరువునష్టం కేసు కొట్టివేత