Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పరువునష్టం కేసు కొట్టివేత
- Author : Latha Suma
Date : 12-03-2024 - 11:31 IST
Published By : Hashtagu Telugu Desk
Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Union Minister Smriti Irani )పై షూటర్ వర్తికా సింగ్(Shooter Vartika Singh) వేసిన పరువునష్టం (Defamation Case) పిటీషన్‌ను అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) కొట్టివేసింది(dismissed). లక్నో బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. జర్నలిస్టులు వేసిన పిటీషన్‌కు కోర్టు స్పందిస్తూ, ఒకవేళ పిటీషనర్ కాంగ్రెస్ పార్టీకి చెందినా లేక గాంధీ ఫ్యామిలీకి చెందినా, అది పరువునష్టం కేసు కిందకు రాదు అని బెంచ్ పేర్కొన్నది. ఫయాజ్ ఆలమ్ ఖాన్‌కు చెందిన బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. మార్చ్ 5వ తేదీన వచ్చిన ఆ తీర్పును సోమవారం కోర్టు సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్(Shooter Vartika Singh) .. సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పరువునష్టం కేసును ఫైల్ చేశారు. 2022, అక్టోబర్ 21వ తేదీన స్పెషల్ కోర్టు ఆ కేసును రద్దు చేసింది. అయితే ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర మంత్రి పర్సనల్ సెక్రటరీ గురించి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రశ్న వేసిన సమయంలో.. మంత్రి స్మృతి దానికి సమాధానం ఇస్తూ పిటీషనర్ కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మ అని, గాంధీ కుటుంబంతో ఆమెకు నేరుగా లింకులు ఉన్నట్లు ఆరోపించారు.
read also: CAA : సీఏఏ అంటే ఏంటి? దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలెందుకు జరిగాయి?
అయితే ఆ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఎక్కడ కూడా పిటీషనర్ పేరును మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తావించలేదని కోర్టు తెలిపింది. మంత్రి స్మృతి ఇరానీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేవలం రాజకీయ పార్టీని విమర్శిస్తోందని, పిటీషనర్‌ను కించపరుచాలన్న ఉద్దేశం ఆమెకు లేదని బెంచ్ తన తీర్పులో పేర్కొన్నది.