Delhi Elections 2025: ఆప్ మరో జాబితా.. కాంగ్రెస్ కంచుకోటలో కేజ్రీవాల్ పోటీ
దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. ఆయనను కేజ్రీవాల్(Delhi Elections 2025) ఢీకొననున్నారు.
- Author : Pasha
Date : 15-12-2024 - 2:14 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Elections 2025: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 38 మంది అభ్యర్థుల పేర్లతో చివరిదైన నాలుగో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి.. కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తారు. న్యూఢిల్లీ స్థానంలో హోరాహోరీ పోరు జరగనుంది.
Also Read :Name Correction : టెన్త్ సర్టిఫికెట్లో మీ పేరు తప్పుపడిందా ? ఇలా చేయండి
Here is our fourth and final list for upcoming Delhi Elections ‼️
Congratulations to all the candidates 🎉
फिर लायेंगे केजरीवाल 🔥💯 pic.twitter.com/YVgypI9mR9
— AAP (@AamAadmiParty) December 15, 2024
ఎందుకంటే అక్కడి నుంచి దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. ఆయనను కేజ్రీవాల్(Delhi Elections 2025) ఢీకొననున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనూ ఢీకొనేందుకు ఆప్ రెడీగా ఉందనే సంకేతాలు ఇచ్చేందుకే.. తాను పోటీచేసేందుకు న్యూఢిల్లీ స్థానాన్ని కేజ్రీవాల్ ఎంచుకొని ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక గ్రేటర్ కైలాశ్ స్థానంలో ఆప్ కీలక నేత సౌరభ్ భరద్వాజ్, బాబర్ పూర్ నుంచి గోపాల్ రాయ్, బల్లి మారన్ నుంచి ఇమ్రాన్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. చివరి జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఆప్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది.
Also Read :Nandamuri Balakrishna : జూబ్లీహిల్స్‌లోని నందమూరి బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. వాట్స్ నెక్ట్స్ ?
‘‘ఈ రోజు నాటికి మా పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పూర్తి విశ్వాసం, సర్వ సన్నద్ధతతో మేం ఎన్నికల బరిలోకి దూకుతున్నాం. బీజేపీ మిస్సింగ్.. ఆ పార్టీ ఎక్కడా కనిపించడం లేదు. బీజేపీకి సీఎం ఫేస్ లేదు. వాళ్లకు ఒక టీమ్ లేదు. ఒక ప్లానింగ్ లేదు. ఢిల్లీ కోసం బీజేపీకి విజన్ లేదు. కేజ్రీవాల్‌ను తొలగించాలనే ఏకైక దుష్ట మిషన్‌తో బీజేపీ పనిచేస్తోంది. గత ఐదేళ్లలో కేజ్రీవాల్‌ను తిట్టడం తప్ప .. ఢిల్లీ కోసం బీజేపీ చేసిందేమీ లేదు’’ అని ఎక్స్ పోస్ట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తావించింది. ‘‘ఢిల్లీని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆప్‌కు విజన్ ఉంది. మా పార్టీలో విద్యావేత్తలు ఉన్నారు. గత పదేళ్లలో ఢిల్లీ కోసం చాలా పనులు చేశాం. పనిచేసే వాళ్లకే ఢిల్లీ ప్రజలు ఓటేస్తారు. ఇబ్బంది పెట్టేవాళ్లను ప్రజలు పట్టించుకోరు’’ అని ఆప్ వ్యాఖ్యానించింది.