Name Correction : టెన్త్ సర్టిఫికెట్‌లో మీ పేరు తప్పుపడిందా ? ఇలా చేయండి
టెన్త్ సర్టిఫికెట్‌లలో పేర్ల విషయంలో(Name Correction) ఏదైనా తప్పు జరిగితే.. చాలామంది దాన్నే తర్వాతి తరగతుల్లోనూ క్యారీ చేస్తుంటారు.
- By Pasha Published Date - 01:15 PM, Sun - 15 December 24

Name Correction : టెన్త్ నుంచి పీజీ దాకా ఏ కోర్సయినా సరే.. కొంతమంది మార్కుల మెమోలలో పేర్లు తప్పుగా వస్తుంటాయి. కొందరు అభ్యర్థుల పేర్లు తప్పుగా ప్రింట్ అవుతుంటాయి. ప్రత్యేకించి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులకు ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్కువగా ఎదురవుతుంటుంది. అలాంటి వారికి ఉపయోగపడే కథనమిది.
Also Read :Nandamuri Balakrishna : జూబ్లీహిల్స్‌లోని నందమూరి బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. వాట్స్ నెక్ట్స్ ?
టెన్త్ సర్టిఫికెట్‌లలో పేర్ల విషయంలో(Name Correction) ఏదైనా తప్పు జరిగితే.. చాలామంది దాన్నే తర్వాతి తరగతుల్లోనూ క్యారీ చేస్తుంటారు. వాస్తవానికి ఇలాంటి తప్పులను గుర్తించిన వెంటనే సరిచేయించుకోవాలి. ఇదొక పెద్ద ప్రాసెస్ అనే ఉద్దేశంతో చాలామంది పేర్లను కరెక్షన్ చేయించుకోరు. మనం తలచుకుంటే ఆ ప్రాసెస్‌ను ఈజీగా పూర్తి చేసేయొచ్చు. టెన్త్ సర్టిఫికెట్‌లోని పేర్లలో తప్పులను గుర్తించిన వెంటనే.. మనం నేరుగా టెన్త్ చదివిన స్కూలుకు వెళ్లాలి. స్కూలులోని రికార్డుల్లో మీ వివరాలు ఎలా ఎంటర్ చేశారనేది చెక్ చేయాలి. పదోతరగతి బోర్డ్ పరీక్షలకు ఫీజును కట్టేటప్పుడు.. ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపిన నామినల్ రోల్స్‌లో మీ పేరును ఎలా రాశారు అనేది తెలుసుకోవాలి.
Also Read :Sheikh Hasina : హసీనా వల్లే 3,500 మర్డర్స్.. బంగ్లాదేశ్ సర్కారు సంచలన అభియోగాలు
మీ స్కూలు వాళ్లు సరిగ్గానే పంపినా.. ఎస్‌ఎస్‌సీ బోర్డు దగ్గర మిస్టేక్ జరిగితే.. మీ స్కూలు హెడ్ మాస్టర్ ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు ఒక దరఖాస్తును పంపించాలి. ఒకవేళ మీ స్కూలు దగ్గరే మిస్టేక్ జరిగి ఉంటే, ఆ తప్పును సరిచేయాలని నేరుగా స్కూలు నిర్వాహకులనే అడగాలి. ఈ రెండు దారులూ వద్దు అని భావిస్తే.. నేరుగా మీరే ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయానికి వెళ్లాలి. ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్‌లో తప్పులను సరి చేయడానికి ఏమేం చేయాలో అడిగి తెలుసుకోవాలి. దానికి అవసరమైన ఫీజును, డాక్యుమెంట్లను జతచేసి అప్లికేషన్ ఇవ్వాలి. వారు మీ టెన్త్ మార్కుల మెమోలో మార్పులు చేసి.. కొత్త దాన్ని జారీ చేస్తారు.