HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Is Aaps Entry Make Himachal Polls A Three Cornered Fight

Himachal Polls: హిమాచల్‌లో ఆప్‌ దెబ్బ ఎవరికో..?

మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది.

  • By Naresh Kumar Published Date - 02:27 PM, Wed - 9 November 22
  • daily-hunt
AAP
AAP

మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది. కేజ్రీవాల్‌ ఎంట్రీతో హిల్‌ స్టేట్‌లో ఎలక్షన్‌ ఫైట్‌ రసవత్తరంగా మారింది. ఓట్ల వేటలో హోరాహోరీ తలపడుతున్నాయి మూడు ప్రధాన పార్టీలు. ఈ పోరులో ఆమ్ ఆద్మీ పార్టీ అరంగేట్రం ఎవరి కొంపముంచనుంది..? హోరాహోరీ ప్రచారాలు, అగ్రనేతల పర్యటనలు, భారీ హామీలు, అసంతృప్తి సెగలు.. హిమాచల్ ప్రదేశ్‌లో ఎలక్షన్‌ హీట్ పీక్‌కు చేరింది. డబుల్ ఇంజిన్ భరోసాతో బీజేపీ, ఆనవాయితీపై ఆశలతో కాంగ్రెస్.. మార్పు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రజల్లోకి వెళుతున్నాయి.

హిమాచల్ స్వింగ్‌ స్టేట్‌. 1985 నుంచి వరుసగా రెండోసారి ఒకే పార్టీకి అధికారం దక్కిన దాఖలాలు లేవు. ఈ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి .. 2017 ఫలితాలు రిపీట్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. 2021లో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక లోక్‌సభ, 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలను కాంగ్రెస్ క్లీన్‌ స్వీప్ చేసింది. దీంతో బీజేపీ గేరు మార్చింది. హిమాలయ రాష్ట్రంపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా వరుస పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, 3 దశాబ్దాల ఆనవాయితీని బలంగా నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ.

Also Read:  ED New Target: టీఆర్ఎస్ మంత్రికి బీజేపీ `ఈడీ` గాలం?

జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బగేల్‌ ప్రచారంలో పాల్గొంటున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను లేవనెత్తుతున్నారు. పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే.. దిగ్గజ నేత వీరభద్రసింగ్‌ మరణం.. కాంగ్రెస్‌కు పెద్దలోటుగా మారింది. శక్తివంతమైన నేత లేకపోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. పెద్దసంఖ్యలో నేతలు కమలం గూటికి చేరిపోయారు. సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్న నేతలు.. కాంగ్రెస్‌ విజయంపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సంప్రదాయంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు అంటే బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో సమీకరణాలు మారాయి. అనూహ్యంగా సత్యేంద్ర జైన్ జైలుపాలవడంతో.. ఆప్ ప్రచార జోరు తగ్గింది. కేజ్రీవాల్‌, సిసోడియా, రాఘవ్ చద్దా లాంటి నేతలు గుజరాత్‌పై ఫోకస్ పెట్టారు. 67స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినా.. హిమాచల్‌లో ఆప్‌ పెద్దగా ప్రభావం చూపే ఛాన్స్ లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కేజ్రీవాల్ పార్టీ చీల్చిన ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయనేదే అసలు సవాల్‌. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆప్‌ ఎవరికి షాక్ ఇస్తుందో తెలియాలంటే డిసెంబర్ 8 వరకూ ఆగాల్సిందే.

Also Read:  US Midterm Elections Result 2022: అమెరికాలో మధ్యంత‌ర ఎన్నిక‌లు, బైడెన్ పాల‌న‌కు ప‌రీక్ష‌


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP
  • arvind kejriwal
  • bjp
  • congress
  • Himachal elections
  • Himachal polls

Related News

Bihar Elections

Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే కొన్ని నామినేషన్లను రద్దు చేసినట్లు తెలిపింది. రద్దు చేయబడిన నామినేషన్లలో లోపాలు ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది పారదర్శకతను నిర్ధారించడానికి కూడా సహాయపడుతుందని ఈసీ పేర్కొంది.

  • Congress

    Congress: కాంగ్రెస్‌తోనే తెలుగు సినీ పరిశ్రమకు స్వర్ణయుగం!

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Bhatti Vikramarka

    Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

Latest News

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

  • Chardham Yatra: చార్‌ధామ్ యాత్ర.. రెండు పుణ్యక్షేత్రాలు మూసివేత‌!

  • Men Or Women: పురుషులు, మహిళల్లో ఎవరు ఎక్కువ మాంసం తింటారో తెలుసా?

  • Telangana Check Post : తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు

  • US Tariffs: భార‌త్‌కు గుడ్ న్యూస్‌.. టారిఫ్ భారీగా త‌గ్గింపు!

Trending News

    • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

    • Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆట‌గాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!

    • Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంస‌న్‌.. ఇదిగో ఫొటో!

    • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

    • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd