Rajnath Singh : ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం చరిత్ర సృష్టించింది: రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ పూర్తిగా ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి జరిగిందని, ఉగ్రవాదుల స్థావరాలపై స్పష్టంగా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామన్నారు. పాక్ పౌరులపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, లక్ష్యం కేవలం దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ముష్కరులే అని స్పష్టం చేశారు.
- Author : Latha Suma
Date : 07-05-2025 - 6:01 IST
Published By : Hashtagu Telugu Desk
Rajnath Singh : ఇది పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాల్లో కీలక మలుపు. ఉగ్రదాడిపై భారత్ గట్టి ప్రతిస్పందనగా మంగళవారం అర్థరాత్రి “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారత సైన్యం చేపట్టిన చర్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి సుమారు 80 మంది ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ మాస్టర్ స్ట్రోక్ తో ప్రపంచం ఒక్కసారిగా భారత్ వైపు చూసింది. ఈ నేపథ్యాన్ని వివరిస్తూ భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక్కడే వెళ్ళి లంకను తగలబెట్టిన హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించాం’’ అని ఆయన తెలిపారు. భారత్ తలెత్తుకుందంటూ, దేశ భద్రతకు ఎలాంటి భంగం జరిగినా భారత్ సమర్థంగా తిప్పికొడుతుందనే సందేశాన్ని ఈ ఆపరేషన్ ద్వారా ఇచ్చామని వెల్లడించారు.
Read Also: Operation Sindoor : ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం భారత్‌కు లేదు.. పాక్ ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తాం: అజిత్ దోవల్
ఆపరేషన్ పూర్తిగా ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి జరిగిందని, ఉగ్రవాదుల స్థావరాలపై స్పష్టంగా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామన్నారు. పాక్ పౌరులపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, లక్ష్యం కేవలం దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ముష్కరులే అని స్పష్టం చేశారు. ‘‘ఒక్కసారి ఉగ్రవాదులపై కఠినంగా బలప్రయోగం చేయకపోతే, వారు మరింతగా జాలీలు విస్తరిస్తారు. దేశ రక్షణకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని ఆయన అన్నారు. ‘‘త్రివిధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది. వారి అప్రమత్తత, ధైర్యసాహసాలు దేశాన్ని గర్వపడేలా చేశాయి’’ అని పేర్కొన్నారు.
రైట్ టు రెస్పాండ్ (Right to Respond) హక్కును వినియోగించి భారత్ తన ఆత్మరక్షణకు తగిన చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రధానిమోడీ నేతృత్వంలో దేశం శత్రువులకు తగిన బుద్ధి చెప్పిందన్నారు. ‘‘అత్యంత కచ్చితంగా, గౌరవంతో, రిస్క్ ఉన్నా కూడా దేశం కోసం పని చేసిన సైన్యానికి, వారికి మద్దతుగా నిలిచిన ప్రధాని మోడీకి అభినందనలు’’ అన్నారు రాజ్‌నాథ్ సింగ్. ఈ ఆపరేషన్ భారత సైన్య చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచిందని, దేశ ప్రజలు అందరూ తమ రక్షణ బలగాలపై గర్వపడాలని పిలుపునిచ్చారు.
Read Also: Operation Sindoor : సిందూర్ దెబ్బకు పాక్ నెక్స్ట్ ఏ స్టెప్ వేయబోతుంది ..?